కాంగ్రెస్ సీనియర్లపై కమలం ఫోకస్..?

-

తెలంగాణలో కాంగ్రెస్ పరిస్తితి మళ్ళీ దిగజారుతున్నట్లు కనిపిస్తోంది. గత రెండు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితం అవుతూ వస్తున్న కాంగ్రెస్‌ని కేసీఆర్ చావుదెబ్బలు కొడుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పార్టీకి చాలా డ్యామేజ్ చేశారు. అయితే రేవంత్ రెడ్డికి పి‌సి‌సి పగ్గాలు వచ్చాక కాంగ్రెస్ పార్టీ రేసులోకి వచ్చిందని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే రేవంత్ రెడ్డి దూకుడుగా పనిచేసుకుంటూ వస్తున్నారు.

congress

కానీ అనూహ్య పరిణామాల మధ్య తెలంగాణలో రాజకీయ యుద్ధం మారిపోతూ వచ్చింది. ఉపఎన్నికల్లో బీజేపీ గెలవడంతో సీన్ మొత్తం మారిపోయింది. బీజేపీ అనూహ్యంగా టీఆర్ఎస్‌కు పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. టీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అనే స్థాయికి వచ్చింది. అసలు తెలంగాణలో ఆ రెండు పార్టీల మధ్యే వార్ నడుస్తున్నట్లు పరిస్తితి నడుస్తోంది. దీంతో కాంగ్రెస్ ఈ రేసులో పూర్తిగా వెనుకబడిపోయింది.

టోటల్‌గా టీఆర్ఎస్-బీజేపీల మధ్యే రాజకీయ యుద్ధం నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఇదే క్రమంలో బీజేపీ మరింత బలపడటమే లక్ష్యంగా ముందుకెళుతుంది. ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నాయకులని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అధికార టీఆర్ఎస్‌లో అసంతృప్తిగా ఉన్న నాయకులని బీజేపెలోకి తీసుకురావడానికి చూస్తుంది. అదే సమయంలో కమలం పార్టీ…కాంగ్రెస్‌లోని సీనియర్లపై కూడా ఫోకస్ చేసిందని తెలుస్తోంది. ఎలాగో కాంగ్రెస్ పార్టీ పరిస్తితి దిగజారుతుంది. కొందరు సీనియర్లు ఎలాగో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఒప్పుకోవడం లేదు.

ఈ క్రమంలో అలాంటి సీనియర్ నేతలని బీజేపీలోకి తీసుకు రావాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలే చేస్తుందట. ముఖ్యంగా బీజేపీ పూర్తిగా వీక్‌గా ఉన్న నల్గొండ, ఖమ్మం జిల్లాలపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఈ జిల్లాల్లో ఉన్న హస్తం సీనియర్ నేతలని బీజేపీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఇప్పటికే కొందరు సీనియర్లు బీజేపీలోకి టచ్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. వారు త్వరలోనే కాషాయా కండువా కప్పుకోవచ్చని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version