అరవింద్ కోసం బిజెపి ఇంత కష్టపడుతుందా…?

-

తెలంగాణలో కొన్ని కొన్ని కీలక నిర్ణయాలను బీజేపీ తీసుకునే అవకాశాలు ఉండవచ్చు. ప్రధానంగా కేంద్ర మంత్రివర్గంలోకి తెలంగాణ నుంచి ఎవరు వెళ్తారు అనే దానిపైన ఇప్పుడు చర్చలన్నీ జరుగుతున్నాయి. కొంతమంది కీలక నేతల విషయంలో ఇప్పుడు కేంద్ర నాయకత్వం చాలా ఆసక్తి చూపిస్తుంది. ప్రధానంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విషయంలో ఆసక్తికరంగా ఉన్నారు బీజేపీ నేతలు.

ఈ నేపథ్యంలోనే ధర్మపురి అరవింద్ తో త్వరలో కేంద్ర మంత్రులు కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి… ఆయనకు ఏ శాఖ మీద ఆసక్తి ఉంది ఏంటి అనే అంశాలను తెలుసుకున్న తర్వాత కీలక నిర్ణయాన్ని కేంద్ర నాయకత్వం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా త్వరలోనే తెలంగాణ పర్యటనకు కూడా బిజెపి నాయకులు వచ్చే అవకాశం ఉంది. ధర్మపురి అరవింద్ ని క్యాబినెట్లోకి తీసుకుంటే ఎవరికైనా ఇబ్బంది ఉందా లేదా అనే అంశాన్ని కూడా బీజేపీ నేతలను అడిగి తెలుసుకునే అవకాశం ఉంది.

వాస్తవానికి కేంద్ర నాయకత్వం బలంగా ఉంది. కాబట్టి తెలంగాణలో ఏ నిర్ణయం తీసుకున్నా సరే చెల్లుబాటు అవుతుంది. కానీ తెలంగాణలో బలపడే ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి అసంతృప్త నేతలు ఎవరైనా ఉంటే వాళ్లను బుజ్జగించే అంశంలో బీజేపీ దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో బలమైన నాయకులు కొంతమంది ఇప్పుడు బిజెపి వైపు వచ్చే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version