బీజేపీ గ్రేటర్ స్ట్రాటజీ..సెటిలర్లకు దగ్గరగా!

-

ఎంత కాదు అనుకున్న ఏపీలో బీజేపీకి బలం లేదనే సంగతి తెలిసిందే…అక్కడ ఒక సీటు కూడా గెలుచుకునే బలం లేదు..ఎందుకంటే విభజనతో నష్టపోయిన ఏపీని ఆదుకోవడంలో మోదీ సర్కార్ పెద్దగా చొరవ చూపలేదు. అలాగే ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిందే బీజేపీ..కానీ ఆ హోదా ఇవ్వలేదు…హోదా బదులు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పి కూడా…ఆ ప్యాకేజ్ ఇవ్వలేదు. అలాగే విభజన హామీలని పూర్తి స్థాయిలో అమలు చేయలేదు.

అందుకే బీజేపీపై ఏపీ ప్రజలు ఇంకా ఆగ్రహంగానే ఉన్నారు. అయితే బీజేపీపై ఏపీ ప్రజలు కాస్త కోపంగా ఉండటం..తెలంగాణలో ఉన్న బీజేపీకి కాస్త నష్టమే అని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణలో సెటిల్ అయిన ఏపీ ప్రజలు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో…అటు ఖమ్మం జిల్లాలో కూడా ఏపీ ప్రభావం ఉంటుంది. ఏదేమైనా గాని తెలంగాణలో దాదాపు 20-25 స్థానాల్లో గెలుపోటములని సెటిలర్లు ప్రభావితం చేయగలరు.

అయితే వీరు ఇప్పుడు టీఆర్ఎస్ వైపు ఉన్నారు…2018 ఎన్నికల్లో వారి పూర్తి మద్ధతు టీఆర్ఎస్ పార్టీకే దక్కింది..అందుకే అప్పుడు గ్రేటర్‌లో అత్యధిక సీట్లు టీఆర్ఎస్ గెలుచుకుంది. అలాగే జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో బీజేపీ గట్టి పోటీ ఇచ్చినా సరే టీఆర్ఎస్ గెలిచి బయటపడటానికి కారణం సెటిలర్లే. అంటే వారి మద్ధతు ఉంటే దాదాపు అధికారానికి దగ్గరైనట్లే. అందుకే వారిని దగ్గర చేసుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

తమకు కావాల్సిన అస్త్రాలు అన్నిటిని బీజేపీ ప్రయోగిస్తుంది…ఇప్పటికే పవన్‌తో బీజేపీకి పొత్తు ఉంది…ఇటీవల అమిత్ షా…ఎన్టీఆర్‌తో భేటీ అవ్వడం కలిసొచ్చే ఛాన్స్ ఉంది. ఇక టీడీపీతో గాని పొత్తు ఉంటే..తెలంగాణలో టీఆర్ఎస్ వైపు వెళ్ళిన టీడీపీ శ్రేణులు..బీజేపీ వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రేటర్‌లో…అలాగే ఖమ్మంలో కూడా. మరి చూడాలి సెటిలర్లని బీజేపీ ఏ స్థాయిలో ఆకర్షించగలదో.

Read more RELATED
Recommended to you

Exit mobile version