కమలం పక్కాగా గెలిచే సీట్లు ఇవేనా..సింగిల్ డిజిట్.!

-

దక్షిణాదిలో సత్తా చాటాలని చూస్తున్న బి‌జే‌పికి కర్నాటక ఎన్నికలతో నిరాశ ఎదురైందనే చెప్పాలి. ఎందుకంటే దక్షిణాదిలో బి‌జే‌పికి పట్టు ఉన్నది కర్నాటకలోనే అక్కడే భారీగా దెబ్బతింది. ఇక ఏపీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పట్టు శూన్యం. ఇక కర్నాటక తర్వాత బి‌జే‌పికి కాస్త పట్టున్న రాష్ట్రం తెలంగాణ. ఇక్కడ పూర్తి స్థాయిలో పట్టు లేదు గాని..మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే పర్లేదు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిన సరే..పార్లమెంట్ ఎన్నికల నుంచి బి‌జే‌పి పికప్ అవుతూ వస్తుంది. ఇప్పుడు అక్కడ బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్‌లతో పాటు ధీటుగా బి‌జే‌పి ముందుకెళుతుంది. అయితే అక్కడ అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బి‌జే‌పి పనిచేస్తుంది. కానీ బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు చెక్ పెట్టి బి‌జే‌పి అధికారం దక్కించుకోవడం అనేది చాలా కష్టమైన పని. అసలు అక్కడ బి‌జే‌పి ఎన్ని సీట్లు వరకు గెలవగలదు. బి‌జే‌పికి ఏ ఏ స్థానాల్లో పట్టు ఉందనేది ఒక్కసారి చూస్తే..బి‌జే‌పి పక్కాగా అంబర్‌పేట, హుజూరాబాద్, వేములవాడ సీట్లలో గెలవగలదని అంటున్నారు.

ఇక బి‌జే‌పి పట్టున్న సీట్లు ముషీరాబాద్, ఖైరతాబాద్, దుబ్బాక, మునుగోడు, ఆదిలాబాద్, గద్వాల్, కరీంనగర్ ఉన్నాయి. ఇంకా 10 సీట్లలో బి‌జే‌పి ప్రభావం ఉంటుందని, అంతే తప్ప..పెద్దగా తెలంగాణలో బి‌జే‌పి సత్తా చాటలేదని అంటున్నారు. ఆ పార్టీలోకి వచ్చే నాయకులు బట్టే బి‌జే‌పి గెలుపోటములు ఆధారపడి ఉంటాయని, వలసలు లేకపోతే బి‌జే‌పికి ఇబ్బందే అని అంటున్నారు.

అయితే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ బలహీనపడితే బి‌జే‌పికి అడ్వాంటేజ్ అవుతుంది. కానీ ప్రస్తుతానికి ఆ పరిస్తితి కనిపించడం లేదు. బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ ల మధ్యే ప్రధాన పోరు జరిగేలా ఉంది. ఆ రెండు పార్టీల మధ్య దాదాపు 70 సీట్లలో ఫైట్ జరిగే అవకాశం ఉందట. మొత్తానికి బి‌జే‌పి మూడో ప్లేస్ లోకి వెళ్ళేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version