ప్రజాఫిర్యాదుల పరిష్కారంలో తెలంగాణ టాప్​

-

తెలంగాణ రాష్ట్రం మరో ఘనత సాధించింది. ఫిర్యాదుల పరిష్కారంలో రాష్ట్రం మొదటి స్థానం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌ 10వ స్థానానికి పరిమితమైంది. కేంద్ర పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం బుధవారం విడుదల చేసిన కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కారం, పర్యవేక్షణ వ్యవస్థ (సెంట్రలైజ్డ్‌ పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రెడ్రసల్‌ అండ్‌ మానిటరింగ్‌ సిస్టం)కు సంబంధించి విడుదల చేసిన మే నెల నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. రాష్ట్రాలను ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 15 వేలకు మించి ఫిర్యాదులున్న పెద్ద రాష్ట్రాలు, 15 వేల వరకు ఫిర్యాదులున్న రాష్ట్రాలుగా విభజించి ఈ ర్యాంకులు ప్రకటించింది.

ఇందులో 15 వేల వరకు ఫిర్యాదులున్న జాబితాలో 72.49 శాతం పరిష్కరించి తెలంగాణ తొలి ర్యాంకు సాధించగా, 8.61 శాతం పరిష్కారంతో ఆంధ్రప్రదేశ్‌ 10వ స్థానంలో నిలిచింది. 70 శాతానికి పైగా ఫిర్యాదులు పరిష్కరించిన రాష్ట్రాల్లో లక్షద్వీప్‌, తెలంగాణ మాత్రమే ఉన్నాయి. 10 శాతం లోపు మాత్రమే పరిష్కరించి పశ్చిమబెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌ చివరి స్థానాలకు పరిమితమయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version