ఏపీ డిసెంబర్‌లోనో ఎన్నికలు వస్తాయి – పవన్ కల్యాణ్

-

ఏపీ డిసెంబర్‌లోనో ఎన్నికలు వస్తాయన్నారు పవన్ కల్యాణ్. నవంబర్‌లోనో డిసెంబర్‌లోనో ఎన్నికలు వస్తాయి… ముందస్తు ఎన్నికలు రావని సీఎం జగన్ కథలు చెప్తున్నాడన్నారు. సీఎం జగన్ ఎలక్షన్ కమిషన్‌తో మాట్లాడుతున్నాడు ప్రిపేర్ అవుతున్నాడు. నేను బీజేపీతో ఉన్న ముస్లింలపై చేయి పడితే ఉరుకోనని చెప్పానని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.

నేను గొడవ పెట్టకుంటున్న వ్యక్తులు వేల కోట్లు సంపాదించిన వారు. నన్ను పాలించేవాడు నా కంటే నీతి మంతుడు అయ్యి ఉండాలని చెప్పారు. నా కోసం రాజకీయాలలోకి రాలేదు.. మీ భవిషత్తు కోసం వచ్చాను. నన్ను పాలించే వారికి నేను గులాం గురి చేయను. పొట్టి శ్రీరాములు బలిదానం వలన ఏపీ ఏర్పడిందన్నారు. ఆంధ్రకు ముఖ్యమంత్రులు పొట్టి శ్రీ రాములుకి మోకారిల్లాలి. మన నాయకులు ఆయనను తు తు మంత్రంగా గుర్తు చేసుకుంటున్నారన్నారు పవన్ కళ్యాణ్. మీ అభిమానం, ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు. వారాహి అనే పేరు నేను కోరుకుంటే రాలేదు, నేను పూజించే ఆ తల్లి ఇచ్చిందన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version