ఏపీలో బీజేపీ హిట్ లిస్టులో ఉన్న పెద్ద త‌ల‌కాయ‌లు వీళ్లే..

-

ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది. టీడీపీకి చెందిన ప‌లువురు కీల‌క నేత‌ల‌తో పాటు ఇత‌ర పార్టీల‌కు చెందిన నేత‌ల‌ను కూడా భారీ ఎత్తున త‌మ పార్టీలో చేర్చుకుని స‌త్తా చాటాల‌ని గ‌త కొద్ది రోజులుగా ప్ర‌య‌త్నాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే టీడీపీకి చెందిన న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు బీజేపీలోకి వెళ్లిపోయారు. అప్ప‌టి నుంచి ఆ పార్టీలోకి వ‌ల‌స‌లు ఆగ‌డం లేదు. ఇక ప్ర‌స్తుతం టీడీపీతో పాటు గతంలో కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేసిన నేతలపై కమల దళం వల విసురుతోంది. బీజేపీ జాతీయ నాయకత్వం కూడ రాష్ట్ర నాయకత్వానికి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టుగా ప్రచారం సాగుతోంది.

వ‌చ్చే రెండేళ్ల‌లో ఏపీలో బీజేపీ అన్ని జిల్లాల్లోనూ స్ట్రాంగ్‌గా ఉండాల‌న్న టార్గెట్‌తోనే ముందుకు వెళుతోంది. అధికార వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలపై కూడ ఆ పార్టీ కన్నేసినట్టుగా ప్రచారంలో ఉంది.ప్రధానంగా టీడీపీ నేతలపై బీజేపీ నాయకత్వం ప్రస్తుతం దృష్టి కేంద్రీకరించింది. ఇక ఏపీలో ప్ర‌స్తుతం బీజేపీ టార్గెట్‌లో ఉన్న నేత‌ల్లో మాజీ మంత్రి కడప జిల్లాకు చెందిన టీడీపీ నేత ఆదినారాయణరెడ్డి ఉన్నారు. ఆయ‌న ఇప్ప‌టికే బీజేపీలో చేరుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

ఇక అదే క‌డ‌ప జిల్లాకు చెందిన కొంద‌రు మాజీ ఎమ్మెల్యేల‌ను బీజేపీలో చేర్చేందుకు అదే జిల్లాకు చెందిన బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం.ర‌మేశ్ కాచుకుని కూర్చుని ఉన్నారు. ఆయ‌న ఇప్ప‌టికే వీరశివారెడ్డి, వరదరాజులు రెడ్డిని బీజేపీలో చేర్పించేందుకు ప్రయత్నాలను ప్రారంభించారని బీజేపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈ క్ర‌మంలోనే మ‌రో బిగ్ వికెట్ తీసేందుకు కూడా బీజేపీ ప్ర‌యత్నాలు చేస్తోంది.

ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డితో కూడ బీజేపీ నాయకత్వం చర్చలు జరిపినట్టుగా ప్రచారం సాగుతోంది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తనతో సన్నిహితంగా కాంగ్రెస్ నేతలను బీజేపీలో చేరేలా కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ నాయకత్వం బాధ్యతలు అప్పగించినట్టుగా ప్రచారంలో ఉంది. ఆయ‌న గ‌త మూడేళ్ల క్రిత‌మే బీజేపీలోకి వెళ్లిపోతార‌ని వార్త‌లు వ‌చ్చినా సైలెంట్‌గానే ఉన్నారు. ఇక ఇప్పుడు త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం బీజేపీలోకి వెళ్లాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా వ‌చ్చే ఐదారు నెల‌ల్లో ఏపీలో ప‌లువురు కీల‌క నేత‌లు కాషాయం తీర్థం పుచ్చుకోవ‌డం ఖాయం.

Read more RELATED
Recommended to you

Exit mobile version