వరద ప్రభావిత ప్రాంతాల్లొ నేడు బీజేపీ నేతల సందర్శన

-

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణలో ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలు వర్షాలకు దారుణంగా ప్రభావితమయ్యాయి. ఇప్పటికే ఈ జిల్లాల్లో వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అన్నిటికంటే ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో మన్నేరువాగు ధాటికి ముంపు ప్రాంతాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.పలు గ్రామాలను మున్నేరు ముంచెత్తడంతో దాదాపు పది గ్రామాలు జలదిగ్భంధనంలో చిక్కుకున్నాయి.

ముంపు గ్రామాల బాధితులను పరామర్శించేందుకు ఇప్పటికే కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగగా..తాజాగా బీజేపీ నేతలు పర్యటించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు వరద బాధితులను పరామర్శించాలని పార్టీ నిర్ణయించింది.అధిక నష్టం వాటిల్లిన ఖమ్మం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో తొలివిడత పర్యటించి బాధితులకు భరోసా కల్పించనున్నారు. రెండో విడత కోదాడ, సూర్యాపేట,ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇక అటు సభ్యత్వ నమోదును ఈనెల 7 నుంచి కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version