కాంగ్రెస్-కారుకు పోటీగా కమలం..ఆ జిల్లాలపై స్పెషల్ ఫోకస్?

-

తెలంగాణలో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ ముందుకెళుతున్న విషయం తెలిసిందే…ఇప్పటివరకు నాలుగైదు సీట్లకే పరిమితమైన బీజేపీ ఇప్పుడు టీఆర్ఎస్ కు చెక్ పెట్టి అధికారం దక్కించుకోవడానికి ఫైట్ చేస్తుంది…కేసీఆర్ ప్రతిపక్షాలని తోక్కేయడం వల్ల అనూహ్యంగా బీజేపీకి ప్లస్ అయ్యి…ఊహించని విధంగా పుంజుకుంది. ఇప్పుడు టీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అంటుంది.

 

అయితే బలంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీని, క్షేత్ర స్థాయిలో బలమైన కేడర్ ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టడం అంత ఈజీ కాదు…దీనికి బ్యాగ్రౌండ్ వర్క్ బాగా చేయాలి. ఏదో రాష్ట్ర స్థాయిలో మీడియాలో టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తే సరిపోదు…క్షేత్ర స్థాయిలో బీజేపీ బలం పెరగాలి..కార్యకర్తలు పెరగాలి. అలాగే బలహీనంగా స్థానాలపై ఫోకస్ పెట్టి పనిచేయాలి.

తాజాగా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోదీ కూడా ఇదే విషయం గురించి చెప్పారు…. సంస్థాగతంగా బలపడితేనే అధికారం దక్కుతుందని బీజేపీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. అందుకే బీజేపీ నేతలు సంస్థాగతంగా బలపడటంపై ఫోకస్ పెట్టారు…కింది స్థాయిలో టీఆర్ఎస్, కాంగ్రెస్ ల్లో ఉన్న బలమైన నాయకులని బీజేపీలోకి లాగడానికి చూస్తున్నారు. ఇదే క్రమంలో అసలు ఏ మాత్రం పట్టు లేని ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలపై బీజేపీ ఫోకస్ చేసింది.

అసలు ఈ జిల్లాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి…ఈ జిల్లాల్లో బీజేపీకి ఒక పంచాయితీ గెలుచుకునే సత్తా కూడా లేదు..అయితే ఇదంతా ఏడాది క్రితం…ఇప్పుడు బీజేపీపై ప్రజల్లో నమ్మకం పెరిగింది..రెండు జిల్లాల్లో బీజేపీ నిదానంగా పికప్ అవుతుంది. కాకపోతే ఇప్పటికిప్పుడు నేతలు ఎదగడం కష్టం…కాబట్టి రెండు జిల్లాల్లో బలంగా ఉన్న టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలని బీజేపీలోకి లాగాలి. ఇప్పుడు బీజేపీ కూడా అదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు లాంటి బలమైన నేతలపై ఫోకస్ పెట్టారు…ఇంకా నాయకులని లాగడానికి బీజేపీ చూస్తుంది. ఈ రెండు జిల్లాల్లో బీజేపీ బలపడితే అధికారంలోకి రావడం మరింత ఈజీ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version