గెలిచిన కమలం.. ఓడిన కోమటిరెడ్డి..!

-

అదేంటి మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మరి బీజేపీ గెలవడం ఏంటి..ఆ పార్టీ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడం ఏంటి అని అనుకోవచ్చు. అయితే ఈ కామెంట్ విషయంలో లాజిక్ ఉంది..ఆ విషయం మాట్లాడుకునే ముందు ఓ సారి..మునుగోడు కౌంటింగ్ గురించి మాట్లాడుకుంటే..ప్రతి రౌండ్ హోరాహోరీగా సాగిందని చెప్పొచ్చు. మొదట ఐదు రౌండ్లు నువ్వా నేనా అన్నట్లు సాగాయి.

1, 4, 5 రౌండల్లో టీఆర్ఎస్‌కు లీడ్, 2,3 రౌండ్లలో బీజేపీకి లీడ్ వచ్చింది. కానీ ఓవరాల్‌గా టీఆర్ఎస్‌కు స్వల్ప లీడ్ ఉంది…కానీ 6వ రౌండ్ నుంచి టీఆర్ఎస్ దూసుకెళ్లింది…నిదానంగా లీడ్ పెంచుకుంటూ వెళ్లింది. ఇక చివరికి టీఆర్ఎస్ పార్టీ —- ఓట్ల మెజారిటీతో బీజేపీపై గెలిచింది. ఇది కౌంటింగ్‌కు సంబంధించింది..ఇక కమలం గెలుపు..కోమటిరెడ్డి ఓటమి అనే లాజిక్ ఏంటంటే..అసలు మునుగోడులో కమలం పార్టీకి ఏ మాత్రం బలం లేదు.

2018 ఎన్నికల్లో ఇక్కడ కమలం పార్టీకి కేవలం 12 వేల ఓట్లు మాత్రమే పడ్డాయి. అంటే అంతవరకే కమలం బలం..కనీసం డిపాజిట్ తెచ్చుకోలేని పరిస్తితి..అలాంటిది ఇప్పుడు బీజేపీకి దాదాపు 80 వేల ఓట్ల వరకు వచ్చాయంటే మాటలు కాదు. ఇక్కడ బీజేపీ తమ ఓటు బ్యాంక్ గణనీయంగా పెంచుకుంది. అంటే ఈ విషయంలో బీజేపీ సక్సెస్ అయినట్లే. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి బలమైన నేత రావడం, రాష్ట్రంలో బీజేపీ బలం పెరుగుతుండటం, కేంద్రం పెద్దల సపోర్ట్, బీజేపీ నేతల దూకుడు..ఓవరాల్‌గా మునుగోడులో బీజేపీ బలం పెరగడానికి కారణమయ్యాయి.

ఈ ఉపఎన్నికతో రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయింది..ఇంకా టీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని ఫిక్స్ అయ్యే పరిస్తితి. కాకపోతే ఇక్కడ ఓటమి అనేది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యక్తిగతంగా ఇబ్బంది. అయినా ఇదంతా చేతులారా చేసుకున్నది. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలోకి వచ్చి మునుగోడు ఉపఎన్నిక వచ్చేలా చేశారు. బీజేపీ సపోర్ట్ ఉండటం, తన ఇమేజ్, ఆర్ధిక బలం, కాంగ్రెస్ ఓట్లు కలిసొస్తాయనే ధీమాతో బరిలో దిగారు.

కానీ ఊహించని రీతిలో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ ఓటు అనుకున్న విధంగా కోమటిరెడ్డికి షిఫ్ట్ అవ్వలేదు..కాంగ్రెస్ పార్టీకి దాదాపు 18 వేల పైనే ఓట్ల వరకు వచ్చాయి. అలా కాంగ్రెస్‌కు అన్నీ ఓట్లు పడటం కోమటిరెడ్డికి మైనస్ అయింది. అటు కమ్యూనిస్టులు టీఆర్ఎస్‌కు సపోర్ట్ చేయడం మైనస్. ఓవరాల్‌గా చూసుకుంటే మునుగోడులో ఓటమి కోమటిరెడ్డికి పర్సనల్‌ రాజకీయానికి ఇబ్బంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version