బ్రేకింగ్; వైసీపీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసిన పోలీసులు

-

అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి చేస్తున్న ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అమరావతిలో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటూ రాజధాని గ్రామమైన పెనుమాకలో ఆయన ర్యాలీ చేపట్టారు ఆర్కే.

ఈ సందర్భంగా అడ్డుకున్న పోలీసులు, 144 సెక్షన్ అమలులో ఉందని, ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే ఆయనను అరెస్ట్ చేస్తుండగా వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.

ఎమ్మెల్యేతో పాటు పలువురు నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజధాని గ్రామాల్లో అమరావతి రైతులు మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ ఉద్యమం కొనసాగిస్తున్నారు. అయితే వారి ఉద్యమానికి పోలీసులు అడ్డు తగులుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version