పోచారానికి పోటీగా కీలక నేతను బరిలోకి దింపుతున్న బీఆర్ఎస్.. గేమ్ స్టాట్..

-

బీఆర్ఎస్ అదికారంలో ఉన్న సమయంలో పదవులు అనుభవించి.. కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి టార్గెట్ గా బీఆర్ ఎస్ పార్టీ పావులు కదుపుతోంది.. ఈ వ్యవహారాన్ని కేసీఆర్ సీరియస్ గా దృష్టి పెట్టారట.. ఆయనకు చెక్ పెట్టేందుకు సమర్దవంతమైన నేతకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించాలని పార్టీ భావిస్తోందట.. ఇంతకీ బీఆర్ఎస్ వ్యూహమేంటి..? పోచారాన్ని ఇరుకున పెడుతున్న స్వంత పార్టీనేతలెవ్వరు..? ఆయనకు పోటీగా పావులు కదుపుతున్న నేతవ్వరో చూద్దాం..

కామారెడ్డి జిల్లా బాన్సువాడ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి.. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు.. సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు క్యాబినెట్ ర్యాంకుప పదవి అప్పగించారు.. అయితే ఆయన చేరికను మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి వ్యతిరేకిస్తున్నారు..ఆయన వర్గం పోచారంతో సయోద్యకు ఒప్పుకోవడంలేదు.. నేరుగా సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్నా… రవీందర్ రెడ్డి మాత్రం తగ్గదేలా అంటున్నారు.. దీంతో నియోజకవర్గ అధికార పార్టీలో రెండువర్గాలు తయారై లొల్లి ఎక్కువైంది..

వారిద్దరి మధ్య సయోద్య కుదరకపోవడంతో ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిందని పార్టీలో చర్చ నడుస్తోంది..ఇదే సమయంలో ప్రతిపక్ష బీఆర్ ఎస్ కూడా.. టార్గెట్ పోచారం అన్నట్లుగా పావులు కదుపుతోంది.. బాన్సువాడలో పోచారం పరిస్థితిని తెలుసుకున్న గులాబీ బాస్.. ఆ నియోజకవర్గంపై పోకస్ చెయ్యాలంటూ కీలక నేతలకు ఆదేశాలిచ్చారట.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డికి ఐదేళ్లు మంత్రిగా.. మరో ఐదేళ్లు స్పీకర్గా అవకాశం దక్కింది. తాను అంత మర్యాద ఇచ్చి గౌరవిస్తే, ఆయన ఏ మాత్రం ఆలోచించకుండా పార్టీ మారి ద్రోహం చేశారంటూ కేసిఆర్ కోసంగా ఉన్నటు తెలిపింది.

దీంతో ఆయనకు నియోజకవర్గంలో చెక్‌ పెట్టేందుకు సమర్దవంతమైన నేత కోసం అన్వేషిస్తున్నారట..ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ కు బాధ్యతలు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీలో చర్చ నడుస్తోంది.. పోచారానికి బాజీరెడ్డి చెక్ పెడతారా లేదో చూడాలి మరి..

Read more RELATED
Recommended to you

Latest news