telangana politics

ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌లు.. అధికార పార్టీ నేత‌ల స‌వాళ్లుః భూ క‌బ్జా రాజ‌కీయాలు

తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన ఈట‌ల రాజేంద‌ర్ భూ క‌బ్జా ఆరోప‌ణ‌ల వ్య‌వ‌హారం చ‌ల్లార‌క ముందే.. ఇత‌ర మంత్రులు, ఎమ్మెల్యేల‌పైనా తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఆధారాల‌తో స‌హా ప్రెస్‌మీట్లు పెడుతూ.. ప్ర‌తిప‌క్ష నేత‌లు విరుచుకుప‌డుతున్నారు. ఈట‌ల వ్య‌వ‌హారంలో జెట్ స్పీడ్ విచార‌ణ జ‌రిపించిన‌ట్టు సీఎం కేసీఆర్ వారిపైన కూడా విచార‌ణ జ‌ర‌పాల‌ని బీజేపీ, కాంగ్రెస్...

రాజ‌కీయాల నుంచి త‌ప్పుకున్న దిగ్గ‌జం.. ప్ర‌త్య‌ర్థులు మెచ్చిన జానారెడ్డి!

జానారెడ్డి.. తెలంగాణ రాజ‌కీయాల్లో చెర‌గ‌ని ముద్ర ఆయ‌న‌ది. ముఖ్యంగా న‌ల్ల‌గొండ రాజ‌కీయాల‌ను త‌న క‌నుసైగ‌ల‌తో శాసించిన దిగ్గ‌జం. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచే కాంగ్రెస్ లో ఆయ‌న‌ది తిరుగులేని పెత్త‌నం. తెలంగాణ రాజ‌కీయాల్లో ఏం జ‌రిగినా ఆయ‌న ప్ర‌మేయం ఉండేది. వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాం నుంచే ఆయ‌న‌కు అత్య‌ధిక ప్రాముఖ్య‌త ఉండేది. అలాంటి వ్య‌క్తికి ఇప్పుడు...

టీఆర్ఎస్ కి ప్లస్ అవుతున్న లెఫ్ట్ పార్టీల తడబాటు

ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీల మద్దతు కోసం ప్రధాన రాజకీయ పార్టీలు వెంటపడేవి. కామ్రేడ్‌లు గెలిపిస్తారు అనే దానికంటే.. వాళ్లు తోడు ఉంటే నమ్మకం.. సెంటిమెంట్ అని భావించేవారు. మిగతా పార్టీలకంటే భిన్నమని చెప్పుకొనే లెఫ్ట్‌ పార్టీలు ఒక్కో ఎన్నికలో ఒక్కో పార్టీతో జతకట్టడం ద్వారా విశ్వసనీయత కోల్పోయాయి. లెఫ్ట్ పార్టీల తడబాటు నిర్ణయాలు చివరకు...

మునుగోడు టీఆర్ఎస్ లో చిచ్చు పెట్టిన ఉద్యమకారుల కరపత్రం

నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ టిఆర్‌ఎస్‌లో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పార్టీ ఉద్యమ సమయం నుంచి పని చేస్తున్న ఓ కార్యకర్త విడుదల చేసిన కరపత్రం నియోజకవర్గంలో రాజకీయ దుమారం రేపింది....

వరుస ఎన్నికలతో కాంగ్రెస్ నేతలకు కొత్త టెన్షన్

తెలంగాణ కాంగ్రెస్‌కి వరస సమస్యలు ఎన్నికల రూపంలో వచ్చి పడుతున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమే పలకరిస్తోంది. పరాజయాలతోపాటు ఆర్థిక సమస్యలు కూడా మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా ఉంది తెలంగాణలో కాంగ్రెస్‌ పరిస్థితి. అన్నీ వరస సమస్యలే. ఒకవైపు పరాజయాలు పలకరిస్తుంటే.. మరోవైపు వరస ఎన్నికలు నాయకుల్ని...

బండి సంజయ్‌ను దెబ్బకొట్టేందుకు సొంత పార్టీ నేతలు భారీ స్కెచ్

బీజేపీ జాతీయ నాయకత్వంలో పలుకుబడి కలిగిన నేతలే.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని టార్గెట్ చేశారని సొంత పార్టీనేతలే చర్చించుకుంటున్నారు. ఆ నేతల డైరెక్షన్‌లోనే లింగోజిగూడ డివిజన్ ఏకగ్రీవం కోసం ప్రగతి భవన్‌ మెట్లు తొక్కారనీ, రాజకీయ కుట్రలో భాగంగానే ఎల్బీనగర్ నియోజకవర్గ బీజేపీ నేతలను మంత్రి కేటీఆర్ దగ్గరకు పంపించారనీ గుసగుసలు...

సిద్దిపేటలో హరీశ్ ని టెన్షన్ పెడుతున్న రెబల్స్

సిద్ధిపేటలో ఎన్నికల వేడి రాజుకుంది. మున్సిపల్‌ ఎన్నికలతో అన్ని పార్టీలు ఊపిరి సలపని బిజీలో ఉన్నాయి. అయితే మున్సిపాలీటిలో పార్టీలకు రెబెల్స్ బెడద పట్టుకుంది. టీఆర్‌ఎస్‌లో పాత, కొత్త నేతల మధ్య పొసగకపొవడంతో భారీగా రెబల్ అభ్యర్ధులు నామినేషన్ వేశారు. సిద్దిపేటలో అన్నీ తానై నడిపచే హరీశ్ మాట సైతం రెబల్ అభ్యర్దులు లెక్క...

నాగర్ కర్నూలు టీఆర్ఎస్ వర్గపోరులో పోలీసుల పాత్ర పై రగడ

నాగర్‌కర్నూలు జిల్లా టీఆర్‌ఎస్‌ రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి మధ్య ఉన్న ఆధిపత్య పోరు అనూహ్య మలుపు తిరిగింది. టీఆర్ఎస్ లో ఉన్న అంతర్గత పోరు పై స్పందించిన కూచుకుళ్ల ఏకంగా పోలీసులను టార్గెట్ చేశారు. అనుచరులపై పోలీస్‌ కేసులు పెట్టడంతో ఒక్కసారిగా బరస్ట్‌ అయ్యారు. స్వపక్షంలో విపక్షంలా...

తెలంగాణలో పొలిటికల్‌ స్పేస్‌ లేదని షర్మిలకి అర్దమవుతుందా

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చర్చగా మారిన షర్మిల పార్టీ, ముందు ముందు ఎలా ఉండనుందనేది పొలిటికల్‌ సర్కిల్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. షర్మిల రాజకీయాలకు కొత్త కాదు. అవగాహన లేని నేత కూడా కాదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబంలో పుట్టింది. తాత, తండ్రి, అన్న ఎటు చూసినా రాజకీయాలే. తాను కూడా స్వయంగా...

ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికల్లో కమ్యునిస్టుల విచిత్ర పొత్తులు

ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం విచిత్రపొత్తులు ఆసక్తికరంగా మారాయి. నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి మద్దతిచ్చిన ఈ రెండు పార్టీలు ఖమ్మంలో మాత్రం చెరోపక్షంగా మారాయి. చివరి నిమిషంలో జరిగిన డ్రామాతో సీపీఐ, సీపీఎంలు చేరో దారి ఎంచుకొన్నాయి. ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి మద్దతిచ్చి ఖమ్మంలో మాత్రం మరో నిర్ణయం తీసుకోవడం...
- Advertisement -

Latest News

వాస్తు టిప్స్: చదువుకునే గదిలో గోడలకి ఎలాంటి రంగులు వేయాలంటే,

మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నపుడు వారి చదువుకునే గది గురించి చాలా శ్రద్ధ తీసుకోవాలి. పాఠశాలల్లో చెప్పింది ఇంటి దగ్గర అభ్యాసం చేసే విద్యార్థులకి...
- Advertisement -

జగన్‌కు చంద్రబాబు లేఖ… ఏం రాశారో తెలుసా?

అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే...

ఆ ఎమ్మెల్యేలకు జగన్ ఇమేజ్ ఒక్కటే ప్లస్ అవుతుందా!

ఏపీలో అధికార వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇందులో సీఎం జగన్‌ని పక్కనబెడితే 150. అలాగే 25 మంత్రులని కూడా తీసేస్తే 125 మంది ఎమ్మెల్యేలుగా...

అజారుద్దీన్ సభ్యత్వం రద్దు.. కారణాలు ఇవే?

హైదరాబాద్: మాజీ క్రికెటర్, హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్‌పై వేటు పడింది. హెచ్ సీఏ ఉన్న ఆయన సభ్యత్వాన్ని అపెక్స్ కౌన్సిల్ రద్దు చేసింది. అజారుద్దీన్‌పై కేసులు పెండింగ్ ఉండటం వల్ల...

కరోనా: ఇండియాలో గుడి కట్టారు.. జపాన్లో మాస్క్ పెట్టారు..

కరోనా మహమ్మారి అంతమైపోవాలని పూజలు, ప్రార్థనలు చేస్తున్న సంగతి తెలిసిందే. గో కరో గో కరోనా అంటూ మహమ్మారి వదిలిపోవాలని రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. అలాంటిదే తమిళనాడులో కరోనా మాత ఆలయం కూడా....