బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి షాకింగ్ నిర్ణయం.. యూపీ ఎన్నిక‌లకు దూరం

-

బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ అధినేత్రి మాజీ సీఎం మాయావ‌తి షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నారు. త్వ‌ర‌లో ఉత్త‌ర ప్ర‌దేశ్ లో జ‌ర‌గ‌నున్న జ‌న‌ర‌ల్ అసెంబ్లి ఎన్నిక‌ల్లో పోటీ చేయకూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఈ విష‌యాన్ని అధికారికంగా బీఎస్పీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌తీష్ చంద్ర ప్ర‌క‌టించారు. అయితే ఎన్నిక‌ల్లో అధినేత్రి మాయావ‌తి పోటీ చేయకున్నా.. ఉత్త‌ర ప్ర‌దేశ్ లో తమ పార్టీయే అధికారంలోకి వ‌స్తుంద‌ని ఆశ‌భావం వ్య‌క్తం చేశారు.

త్వ‌ర‌లోనే ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ స్థానాల‌కు త‌మ పార్టీ నుంచి అధినేత్రి మాయావ‌తి అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తుంద‌ని తెలిపారు. అలాగే ఈ ఎన్నిక‌ల్లో తాను కూడా పోటీ చేయ‌డం లేద‌ని ఆ పార్టీ జాతీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌తీష్ చంద్ర ప్ర‌క‌టించారు. యూపీలో త‌మదే అధికారం అని ధీమా వ్య‌క్తం చేశారు. కాగ ఎన్నిక‌లు స‌మీపించ‌డంతో రాష్ట్రంలో బీజీపీ, ఎస్ పీ కొత్త హామీలు ఇస్తున్నార‌ని అన్నారు. అయితే ఈ పార్టీల‌ను యూపీ ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్థితుల్లో లేరని అన్నారు. ఈ రెండు పార్టీలు అధికారంలో ఉన్న స‌మ‌యంలో యూపీలో ఎలాంటి అభివృద్ధి జ‌ర‌గ‌లేద‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news