ఈ హెడ్డింగ్ చాలా ట్విస్టింగ్‌గానే ఉందా ? ఇదేమైనా గాసిప్పా… లేదా ఎవరైనా రాజకీయ నాయకులు చెప్పిన మాట అనుకుంటున్నారా ? అవేం కాదు… అయితే ఇది నిజమే… ఈ విషయాన్ని ఎవ్వరో చెప్పలేదు ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఆదివారం ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసంలో చెప్పిన పలుకు. ప్రతివారం రాధాకృష్ణ తనకు అలవాటైన రీతిలోనే ఏపీ, తెలంగాణ సీఎంలు జగన్, కేసీఆర్‌లను టార్గెట్ చేసుకుని తన కథనం వండివార్చారు. తన సహజ సిద్ధమైన రాతల్లాగానే ఏపీ సీఎం జగన్‌ను కొద్దిగా ఎక్కువుగా టార్గెట్ చేశారు.
ఆదివారం వ్యాసంలో అన్నింటికన్నా షాకింగ్ న్యూస్ ఏంటంటే ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జనవరి తర్వాత కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే కొనసాగాలని భావిస్తున్నారట. ఈ విషయాన్ని ఆయన తన సన్నిహితులతో చెప్పి వాపోయారట. ఏపీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని… పలు పథకాలు ప్రవేశ పెడుతూ.. హామీలు ఇస్తూ ముందుకు పోతోన్న సీఎం జగన్… అందుకు నిధులు ఎలా ? సమీకరించుకోవాలో ? మాత్రం చెప్పడం లేదని ఆర్థిక శాఖ అధికారులు కూడా వాపోతున్నారట.
జగన్ నిర్ణయాలతో ఆర్థిక శాఖ అధికారులు కూడా సతమతమవుతున్నారని కూడా రాధాకృష్ణ వివరించారు.
ఆర్థిక వ్యవహారాలలో ఇదే ధోరణి కొనసాగితే ఆర్థిక ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడినా… ఆశ్చర్యపోవలసింది ఏమీ లేదని ఒక సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారని వివరించారు.ఇక జగన్ తన సలహాదారుల మాట కూడా వినడం లేదని.. వారు కూడా ఏదో ఉన్నామంతే ఉన్నాం అన్నట్టుగా ముందుకు వెళుతున్నారని కూడా పేర్కొన్నారు.
ఇక గత కొద్ది రోజులుగా ప్రతి ఆదివారం జగన్‌పై జనాలను నమ్మించేలా ఏదో ఒకటి రాసుకొస్తోన్న రాధాకృష్ణ తన తాజా వ్యాసంలో ఏకంగా ఆర్థికమంత్రి తన పదవిని వదులుకుని… జనవరి తర్వాత ఎమ్మెల్యేగా మాత్రమే ఉండాలని అనుకుంటున్నట్టు రాసుకొచ్చారు. ఇందులో వాస్తవ అవాస్తవాలు ఎలా ఉన్నా ? వైసీపీ వాళ్లు దీన్ని ఎంతలా లైట్ తీస్కొంటారో ? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏపీ ప్రభుత్వ పెద్దలు, మంత్రులు…. ఆ పత్రికను, ఆ మీడియాను ఫాలో కారు కాబట్టి దీనిపై స్పందించే ఛాన్స్ కూడా లేదు.