టాప్ హీరో కూతురితో ఇండియ‌న్ క్రికెట‌ర్ ప్రేమాయ‌ణం..!

-

ఇటీవ‌ల భార‌త క్రికెట‌ర్లు హీరోయిన్ల‌తో ప్రేమాయ‌ణాలు న‌డిపిస్తున్నారు. ఈ లిస్టులో ఇప్ప‌టికే హార్దిక్ పాండ్యా లాంటి వాళ్లు ముందు ఉన్నారు. ఇప్ప‌టికే వ‌రుస‌గా అమ్మాయిల‌ను మారుస్తోన్న హార్దిక్ ఓ సెర్బియ‌న్ మోడ‌ల్‌తో డేటింగ్‌లో ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అంతే కాదు సెర్బియ‌న్ మోడ‌ల్‌తో దిగిన ఫొటోలు కూడా వైర‌ల్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు మ‌రో ఇండియ‌న్ క్రికెట‌ర్ కూడా ఓ అమ్మాయితో ప్రేమ‌లో ఉన్న‌ట్టు టాక్‌.

అయితే ఆ అమ్మాయి ఎవ‌రో కాదు ఏకంగా ఓ బాలీవుడ్ స్టార్ హీరో కుమార్తె కావ‌డం మ‌రో విశేషం. ఆ క్రికెట‌ర్ ఎవ‌రో కాదు గ‌తంలో త‌న ప్లే బాయ్ మాట‌ల‌తో వివాదంలో చిక్కుకున్న కేఎల్‌.రాహుల్‌. ఈ యంగ్ క్రికెట‌ర్ పేరు ఇప్పుడు ఆట‌తో కంటే డేటింగ్‌తో వార్త‌ల్లో ఎక్కువుగా నిలుస్తోంది. ఇంత‌కు రాహుల్ డేటింగ్ చేస్తోంది ఎవ‌రితోనో కాదు… బాలీవుడ్ అలనాటి హీరో సునీల్ షెట్టి కూతురు అతియా షెట్టితో.

అతియా షెట్టి ఇప్ప‌టికే బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఇప్పుడు ఈ యంగ్ క్రికెట‌ర్ మ‌న‌స్సు దోచిన‌ట్టు ఉంది. రీసెంట్‌గా అతియా పుట్టిన రోజు జ‌రుపుకుంది. ఈ సందర్భంగా కేఎల్ తామిద్దరి ఫొటోనూ పోస్టు చేసి ఆమెకు శుభాకాంక్షలు తెలిపాడు. ఇక వీరిద్ద‌రు సీక్రెట్‌గా క‌లుసుకుంటూ మీడియా కంట ప‌డ‌కుండా చ‌క్కెర్లు కొడుతున్నారు.

ఈ నేప‌థ్యంలోనే ఈ యంగ్ క్రికెట‌ర్‌… అటు టాప్ హీరో కూతురు మ‌ధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అనే పుకార్లకు మరింత ఊపు వచ్చింది. మరి వీరి ప్రేమాయణం ఎంత వరకూ వెళ్తుందో!

Read more RELATED
Recommended to you

Exit mobile version