జగన్ కు కేంద్రం అడ్డు పడుతుందా…?

-

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల విషయంలో జగన్ కు కేంద్రం అడ్డు పడే అవకాశాలు ఉన్నాయా…? అంటే అవుననే సమాధానమే ఇప్పుడు ఎక్కువగా వినపడుతుంది. వాస్తవానికి రాజధాని విషయంలో ముందు నుంచి కేంద్రం పెద్దగా అడ్డంకులు సృష్టించలేదు. రాజకీయంగా చంద్రబాబుని విమర్శించినా, నిధులు ఇవ్వడానికి ఇబ్బందులు పెట్టినా సరే అమరావతిని రాజధానిగా సమర్ధిస్తూ వచ్చింది. ఇక ప్రధాని శంకుస్థాపన చేయడంతో రాష్ట్ర బిజెపి నేతలు కూడా దీనిపై ఎం మాట్లాడే సాహసం చేయలేదు.

అయితే ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత మాత్రం రాజధాని విషయంలో జగన్ సర్కార్ కాస్త దూకుడుగా వెళ్ళడం మొదలుపెట్టింది. రాజధానిని మార్చే ఆలోచనలో ముందు నుంచి ప్రభుత్వం ఉందనే స్పష్టత జనాలకు వచ్చింది. తాజాగా జగన్ సౌత్ ఆఫ్రికా మోడల్ అంటూ మూడు రాజధానుల ప్రతిపాదనలో భాగంగా అమరావతి ప్రాధాన్యతను తగ్గించారు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇక ఇప్పుడు నూతన రాజధానిగా పరిపాలన విభాగం విశాఖలో పెట్టాలనే ఆలోచనకు కేంద్రం అడ్డు పడే సూచనలు కనపడుతున్నాయి.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక తాత్కాలిక భవనాలు, సుప్రీం కోర్ట్ అనుమతితో ఏర్పాటు చేసిన హైకోర్ట్ అన్నీ కూడా అమరావతిలో ఉన్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సముదాయాలను, ప్రభుత్వ అధికారుల భవనాల నిర్మాణం కూడా 90 శాతం పూర్తి చేసారు. ఇప్పుడు రాష్ట్ర రాజధాని మారిస్తే మాత్రం ఆర్ధికంగా మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉందని అంటున్నారు. రాజధాని మార్పు అనేది సాధారణ విషయం కాదు. దీనికి కేంద్రం అడ్డుపడే అవకాశం ఉందని, మరిన్ని అప్పులు అయితే ఆ భారం తమ మీద కూడా పడుతుందని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version