చంద్రబాబు మాత్రం హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో 22 వేల చదరపు అడుగుల్లో విలాసవంతమైన ప్యాలస్ కట్టుకోవచ్చు కానీ జగన్… ఏపీ ప్రజలకు అందుబాటులో ఉండటానికి తాడేపల్లి లో ఇల్లు కట్టుకోకూడదు.
వైఎస్ జగన్ ఇవాళ గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించిన తన కొత్త ఇంటి గృహ ప్రవేశం చేశారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంతో పాటు కొత్త ఇంటిని జగన్ అక్కడ నిర్మించుకున్నారు. అయితే జగన్ కొత్త ఇంటిని చూసి చంద్రబాబు తట్టుకోలేక పోతున్నట్టు అయన మాటల్లోనే తెలిసిపోతుంది. ఎందుకంటే ఇవాళ టీడీపీ నేతలతో జరిగిన కాన్ఫరెన్స్ లో చంద్రబాబు… జగన్ కొత్త ఇంటి గురించి మాట్లాడారు. తన అక్కసునంతా ఆ కాన్ఫరెన్స్ లో వెళ్లగక్కారు. ప్యాలస్ లేకపోతే జగన్ బతకలేరా అంటూ ఎద్దేవా చేశారు.
ఇన్ని రోజులు హైదరాబాద్ లో ఉండి ఏపీ రాజకీయాలు చేయడం ఏందీ అని ఆడిపోసుకున్నది చంద్రబాబే… ఇప్పుడు రాజధానికి సమీపంలో ఇల్లు కట్టుకుంటే విమర్శించేది చంద్రబాబే. అసలు చంద్రబాబు మాటల్లో ఎప్పుడూ పొంతన ఉండదు. ఊసరవెల్లికి తాత. ఈరోజు మాట్లాడింది రేపు మాట్లాడడు…రేపు మాట్లాడింది ఎల్లుండి మాట్లాడడు. అది అయన స్వభావం. దాన్నే ఎప్పుడూ బయట పెడుతుంటాడు. అదే ఇప్పుడు కూడా జరిగింది. జగన్ కొత్త ఇల్లు కట్టుకుంటే చూసి ఓర్వలేక పోతున్నాడు.
చంద్రబాబు మాత్రం హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో 22 వేల చదరపు అడుగుల్లో విలాసవంతమైన ప్యాలస్ కట్టుకోవచ్చు కానీ జగన్… ఏపీ ప్రజలకు అందుబాటులో ఉండటానికి తాడేపల్లి లో ఇల్లు కట్టుకోకూడదు. చంద్రబాబు నీ గృహ ప్రవేశానికి నీ వియ్యంకుడు బాలకృష్ణ తప్ప మరొకరు రాలేదు. అందరిని పిలిస్తే నీ ప్యాలస్ బండారాలు అన్నీ బయట పడతాయి కదా… కానీ జగన్ అలా కాదు. చాలామందిని పిలిచి అందరి సమక్షంలో గృహ ప్రవేశం చేశారు. అదీ నీకు జగన్ కు ఉన్న తేడా.