పులివెందులలో కూడా వైసీపీ గెలవలేదు : చంద్రబాబు

-

తన కర్నూలు పర్యటనతో వైసీపీలో ప్రకంపనలు వచ్చాయని తెడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రస్తుత వైసీపీ పాలన చూస్తే వచ్చే ఎన్నికల్లో పులివెందులలో కూడా ఆ పార్టీ గెలిచేలా కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. స్వార్థ రాజకీయాలను ప్రజలెప్పుడూ ప్రోత్సహించరని తెలిపారు. ఎందుకు ఓటేశామా అని ఓటర్లు తలబాదుకునేలా జగన్ పాలన సాగిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘‘8 జిల్లాల్లో పార్టీ అధ్యక్షులను వైకాపా మార్చేసింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపాకు వచ్చే సీట్లు గుండు సున్నా. పులివెందులలో కూడా గెలవలేదు. పేరు, స్వార్థం కోసం జగన్‌ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఏదైనా పని చేస్తే తనకెంత.. ఎంత మొత్తంలో సంపాదించుకోవచ్చనేదే ఆలోచన. ఇది పన్నుల ప్రభుత్వం.. ఇదేం ఖర్మ అనుకునే పరిస్థితి వచ్చింది’’ అని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version