చంద్రబాబుతో పెట్టుకుంటే అంతేమరి…నట్టేట ముంచేయడమే

-

తన స్వార్ధం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంతకైనా దిగజారుతాడు.ఎదుటి వ్యక్తిని కూడా అంతే స్థాయికి దిగజార్చి భవిష్యత్తు లేకుండా చేయడం చంద్రబాబు కి నీళ్లు తాగినంత ఈజీ. తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య సీట్ల పంచాయతీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నికలు సమీపిస్తున్నా చంద్రబాబు సీట్లపై ఇంకా తేల్చకపోవడంతో జనసేన కేడర్ అసహనానికి లోనవుతున్నారు.

తాజాగా ఇరు పార్టీల అధినేతలు మరోసారి సీట్ల సర్దుబాటుపై కలవడం చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీపై రకరకాలుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.చంద్రబాబు తో పొత్తు చారిత్రక అవసరం అంటూ ముందునుంచీ ఊదరగొట్టిన పవన్‌కళ్యాణ్‌ కేవలం ప్యాకేజీలు కోసమే ఇలా చేస్తున్నాడని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఒకవైపు ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటూనే మరోవైపు చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న పవన్… దీనిపై చిత్రవిచిత్ర థియరీలు చెప్పేస్తున్నారు.అవినీతి కేసులో చంద్రబాబు అరెస్టయితే రోడ్డుకు అడ్డంగాపడుకుని నిరసన తెలిపారు. అంతేకాదు ఆగమేఘాల మీద రాజమండ్రి జైలుకు వెళ్లి మరీ… బాబుకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ఆత్మగౌరవం నిలబడేలా పొత్తులో భాగంగా సీట్లు వస్తున్నాయంటూ క్యాడర్‌కు ఇన్నాళ్లూ నమ్మబలికారు.

సీట్ల పంపిణీపై ఇప్పటికే పలుమార్లు భేటీ అయ్యారు.రాజమండ్రి జైల్లో ములాఖత్‌లు,యువగళం ముగింపు సభ కలవడం…ఇలా ఇప్పటికి 7 సార్లు ఇరువురు అధినేతలు కలుసుకున్నారు.అయినప్పటికీ ఇంకా సీట్ల సర్దుబాటు తేలడం లేదు.అసలు విషయం ఏమిటంటే పవన్‌కళ్యాణ్‌ కలిసిన ప్రతిసారీ జనసేనకు సీట్లను క్రమక్రమంగా చంద్రబాబు తగ్గించుకుంటూ వస్తున్నారని సమాచారం.

ఇవాళ జరిగిన మీటింగ్లో జనసేనకు 28 సీట్లే ఇస్తానని చంద్రబాబు తెగేసి చెప్పినట్లు సమాచారం. 45 సీట్లు ఇవ్వాలని పవన్ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఈసారి కూడా ఏమీ తెలకపోవడంతో పవన్ నిరాశగా వచ్చినట్లు తెలిసింది. మొత్తంగా చూస్తే చంద్రబాబు దెబ్బతో జనసేన ఆశలు గల్లంతయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడింట ఒక వంతు సీట్లు అనేది ఒట్టిమాట అని తేలిపోయింది.జనసేనకు సీట్లను గణనీయంగా తగ్గించేస్తున్నా పవన్ ఇంకా ఎందుకు పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నారు అని సొంత కేడర్ గగ్గోలు పెడుతోంది.పైగా ఇచ్చే అరకొర సీట్లనూ తెలుగుదేశం త్యాగంగా చూపాలంటూ ఎల్లోమీడియాకు చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడం కొసమెరుపు. ఇదంతా పవన్ ఎప్పుడు గ్రహిస్తారోనని జనసేన కేడర్ తలలు పట్టుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version