ప్రజా చైతన్య యాత్ర లో చంద్రబాబు నాయుడు అలా అనడం తో పడీ పడీ నవ్వుతోంది రాష్ట్రం మొత్తం..!!

-

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీని నిలబెట్టడానికి ఆపసోపాలు పడుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికలలో ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పు కి టిడిపి పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది. దీంతో వయసు మీద పడటంతో ఏమో తెలియదు గానీ చంద్రబాబు నాయుడు ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు అందరికీ నవ్వు తెప్పిస్తుంది. విషయంలోకి వెళితే ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రజా చైతన్య యాత్ర ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ప్రకాశం జిల్లాలో మొదలైన ఈ యాత్ర కి ప్రకాశం జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం హాజరయ్యింది.

ఈ సందర్భంగా రోడ్ షో లో చంద్రబాబు నాయుడు సొంత పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన తీరు ఆ జిల్లా టీడీపీ నేతలకే చెవుల్లో గింగురు అన్నట్టు అనిపించింది. విషయంలోకి వెళితే రోడ్ షో లో టిడిపి కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ…’మీరంతా మొన్నటి ఎన్నికల్లో వైసిపికే ఓట్లేశారు కదా’  అంటూ ప్రశ్నించారు. ముందు చంద్రబాబు అడిగిన ప్రశ్న వారికి సరిగా అర్ధంకాలేదు. అయితే అర్ధమవ్వగానే లేదు లేదు అంటూ గట్టిగా కేకలేశారు.

 

కానీ చంద్రబాబు మాత్రం నమ్మలేదు. నమ్మకపోగా ’నాకు తెలుసు మీరంతా వైసిపికే ఓట్లేశారు’ అంటూ రెట్టించటంతో ఏమి సమాధానం చెప్పాలో కార్యకర్తలకు అర్ధంకాలేదు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో రావడంతో…చంద్రబాబు కి మతిభ్రమించింది ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు అంటూ రాష్ట్రం మొత్తం తెగ పడి పడి నవ్వుకుంటున్నారు. 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version