మాట, పొత్తులు మార్చడంలో బాబు నాకన్నా సీనియరే: మోదీ

-

ఏపీ ముఖ్యమంత్రి తరుచూ తనను తాను చాలా సీనియర్ అని చెప్పుకుంటాడని.. ఆయన ఎందులో సీనియర్ అంటూ ప్రధాని మోదీ ప్రశ్నించారు. మాట మార్చడంలో, పొత్తులు మార్చడంలో, పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు చాలా సీనియర్ అంటూ మోదీ ఎద్దేవా చేశారు. ఏపీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ గుంటూరులో జరిగిన మహాసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు.

ఎన్నికల్లో ఓడిపోవడంలో కూడా చంద్రబాబు సీనియర్ అని, దానిలో ఆయనతో తాను పోటీ పడలేనని మోదీ విమర్శించారు. చంద్రబాబు సీనియారిటీని తాను గౌరవించానని… అయితే ప్రజా సంక్షేమం నుంచి ఆయన పక్కకు వెళ్లిపోయారని మోదీ తెలిపారు.

అద్భుత నగరంగా అమరావతిని నిర్మిస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు తన పార్టీని పునర్నిర్మించడంలో మునిగిపోయారని మోదీ స్పష్టం చేశారు. ఏపీని సన్ రైజ్ స్టేట్ గా మారుస్తానని చెబుతూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు తన కొడుకును రైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. కొత్త కొత్త పథకాలు రూపొందిస్తున్నానని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నదేమిటంటే.. కేంద్రం పథకాలకు స్టిక్కర్లు అంటించుకుంటున్నారని విమర్శించారు. ఏపీలో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ పాలనకు రానున్న ఎన్నికల్లో తెరపడనుందని మోదీ స్పష్టం చేశారు. ఇవాళ టీడీపీ, ఇతర పార్టీలు తన రాకను నిరసిస్తూ చేసిన నల్ల జెండాల ప్రదర్శన మాకు దిష్టి తీసినట్టుగా ఉందని మోదీ చమత్కరించారు. అనంతరం జై ఆంధ్ర, జై భారత్ అంటూ తన ప్రసంగాన్ని మోదీ ముగించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version