చంద్రబాబు మళ్లీ నల్ల చొక్కా వేశారు. ఆయన నల్లచొక్కాతోనే ఇవాళ జరిగిన మీటింగుల్లో పాల్గొన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలులో కేంద్రం వివక్షకు గురి చేస్తోందని దానికి నిరసనగా మరోసారి నల్లచొక్కా ధరించి నిరసన తెలిపాడు చంద్రబాబు. ఆ నల్లచొక్కాతోనే సభల్లో పాల్గొని ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు.
అయితే.. చంద్రబాబు మరోసారి నల్లచొక్కా ధరించడంపై నెటిజన్లు తెగ సెటైర్లు వేస్తున్నారు. నల్లచొక్కా వేసుకోగానే ప్రత్యేక హోదా వస్తుందా? ప్రధాన మంత్రి స్థాయి వ్యక్తి రాష్ట్రంలో పర్యటించడానికి వచ్చినప్పుడు ఇలా గోబ్యాక్ అంటూ నిరసనలు తెలుపుతూ అడ్డుకోవడం ఏంది? ఇదెక్కడి ప్రజాస్వామ్యం. చంద్రబాబుకు తెలిసిన ప్రజాస్వామ్యం ఇదేనా? చంద్రబాబు కూడా తెలంగాణకు ఎంతో మోసం చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా పోరాడారు. మరి.. తెలంగాణ ప్రజలు ఏనాడూ చంద్రబాబును తెలంగాణకు రానీయకుండా అడ్డుకోలేదు కదా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.