ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీలో ఆమోదం పొందిన వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో చైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపించడం జరిగింది. కనీసం బిల్లు గురించి చర్చకు రాకుండా మండలి చైర్మన్ ఓటింగ్ కి పంపించడం వెనుక చంద్రబాబు ఉన్నారని మూడు రాజధానులు నిర్ణయం ఇష్టం లేక చంద్రబాబు కావాలని బిల్లు చర్చకు రాకుండా ఓటింగ్ జరగకుండా చైర్మన్ ని ప్రభావితం చేసే విధంగా మండల గ్యాలరీ లో కూర్చుని మరి ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికేంద్రీకరణ బిల్లు చంద్రబాబే దగ్గరుండి సెలెక్ట్ కమిటీకి పంపించడం జరిగిందని వార్తలు ఇప్పుడు గట్టిగా వినబడుతున్నాయి.
ముఖ్యంగా వైఎస్ జగన్ నీ చంద్రబాబు తన ప్రత్యర్థి నాయకుడిగా గుర్తించలేకపోతున్నారు అని ఇందువల్లనే ఎక్కడా కూడా జగన్ తో పోటీ పడకుండా బిల్లు విషయంలో చర్చలు రాకుండా బిల్లును సెలెక్ట్ కమిటీకి చైర్మన్ పంపించడం జరిగిందని బలమైన వాదన తెలుగుదేశం పార్టీలో వినబడుతుంది.
వైయస్ జగన్ తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డిని తన ప్రత్యర్థిగా ఊహించుకున్న చంద్రబాబు ఆయన తనయుడు వైఎస్ జగన్ ని ప్రత్యర్థి నాయకుడిగా అంగీకరించలేక పోతున్నారని జగన్ ని ఎలాగైనా ముఖ్యమంత్రి పదవి నుండి దింపేయాలి అని చంద్రబాబు అనేక ప్రయత్నాలు మొదలు పెడుతున్నారని దీంతో సొంత పార్టీ నేతలే ఇదేం గోల అయ్యా చంద్రబాబు రాజకీయంగా డి కోటకొండ ఈ విధంగా బిల్లుకు అడ్డంపడి రాజకీయం చేయడం సబబు కాదు ముఖ్యమంత్రి స్థానం పై పిచ్చి ఉందని ప్రజలు తిట్టుకుంటారు అంటూ టీడీపీ నేతలే చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై అసహనం చెందుతున్నట్లు సమాచారం.