వారసత్వ రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు కాకుండా.. తాను నిఖార్సయిన రాజకీయాలు చేస్తానని చెప్పుకొచ్చిన పవన్ కల్యాణ్.. తన అన్న నాగబాబుకు నరసాపురం ఎంపీ టికెట్ ఇచ్చి కుటుంబ రాజకీయాలకు తెరలేపారు.
దేశం మొత్తం ఎన్నికలు జరుగుతున్నా… ఏపీలోనే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓవైపు ఎండాకాలం ఎండలు.. మరోవైపు రాజకీయ వేడి రెండు కలిపి జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీల నాయకులు, అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఏపీలో ఓటింగ్‌కు ఇంకా 13 రోజుల సమయమే ఉండటంతో గెలుపు కోసం పార్టీలు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అన్ని పార్టీలు ఈ ఎన్నికలను చాలెంజింగ్‌గా తీసుకున్నాయి. ఏపీలో పోటీ ప్రధానంగా టీడీపీ, వైసీపీ మధ్యే అని అంటున్నా… మధ్యలో వచ్చిన జనసేన కూడా ఈ రెండు పార్టీలకు కాస్తో కూస్తో పోటీ ఇస్తున్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే.. వారసత్వ రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు కాకుండా.. తాను నిఖార్సయిన రాజకీయాలు చేస్తానని చెప్పుకొచ్చిన పవన్ కల్యాణ్.. తన అన్న నాగబాబుకు నరసాపురం ఎంపీ టికెట్ ఇచ్చి కుటుంబ రాజకీయాలకు తెరలేపారు. దీంతో పవన్ పెద్దన్న, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు తమ్ముళ్లను గెలిపించడం కోసం జనసేన తరుపున ప్రచారం చేస్తారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. తమ్ముళ్ల కోసం అన్నయ్య ఆ మాత్రం చేయలేరా? వాళ్ల గెలుపు కోసం ఆయన ప్రచారం చేయరా? అని అంతా అనుకున్నారు. లేదంటే ఈ ఎన్నికల్లో చిరంజీవి కాంగ్రెస్ పోటీ ఇస్తారా? అని అనుకున్నారు. కానీ.. ఇంతలోనే చిరంజీవి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.
చిరంజీవి అటు జనసేనకు గానీ.. ఇటు కాంగ్రెస్‌కు గానీ మద్దతు ఇవ్వదలుచుకోలేదట. చిరంజీవి ప్రస్తుతం సైరా సినిమాతో బిజీగా ఉన్నారు. దీంతో ఆయన ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా సైలెంట్‌గా ఉండాలని నిర్ణయించుకున్నారట. ఏ పార్టీకి మద్దతుగా ప్రచారం చేసినా వేరే పార్టీ నాయకులు బాధపడతారని.. అందుకే ఏ పార్టీకి కూడా మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. అయితే.. ప్రచారంలో పాల్గొనాలని రెండు పార్టీల నుంచి చిరుకు ఒత్తిడి వచ్చే ప్రమాదం ఉండటంతో ప్రచారం సమయంలో ఆయన తన కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారట. దీంతో పది పదిహేను రోజులు చిరంజీవి విదేశీ పర్యటనలో ఉంటారట. అది అసలు ట్విస్ట్. దీంతో రెండు పార్టీలు డీలా పడిపోయాయట. ముఖ్యంగా పవన్, నాగబాబు అయితే చిరంజీవి ప్రచారం చేస్తే పార్టీకి మద్దతు పెరుగుతుందని అనుకున్నారు కానీ.. చివరికి ఇలా బెడిసి కొడుతుందని ఊహించలేదంటూ జనసేన నేతలు కూడా వాపోతున్నట్లు సమాచారం.
జనసేలోకి చిరు ఎంట్రీ..? పెద్ద తప్పిదానికి పవన్ సిద్దమా..?