తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ కోసం జబర్దస్త్ హైపర్ ఆది రాజకీయంలోకి దిగనున్నాడు. ఇప్పటికే సోషల్ మీడియాలో తన మద్దతు తెలిపిన ఆది.. జనసేన పార్టీ ప్రత్యర్థులపై సెటైరర్లు వేస్తున్నాడు. కాగా ఇప్పుడు ఏకంగా నాగబాబు పోటీ చేస్తున్న నరసాపురం లోక్‌సభ నియోజకవర్గంలో ప్రచారం మొదలెట్టాడు. పవన్ కళ్యాణ్ మాదిరిగానే ఎర్ర తువాలు మెడలో వేసుకొని మార్పుకోసం పవన్ అంటూ ప్రచారం చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన దృష్టి మొత్తం జనసేన పార్టీపైనే ఉంది. ఖచ్చితంగా హైపర్ ఆది ప్రచారం పార్టీకి లాభిస్తుందని చెబుతున్నారు జనసైనికులు.
తన తుదిశ్వాస ఉన్నంత వరకు పవన్ కోసం పాటు పడుతూనే ఉంటానంటున్నాడు ఆది. తనకున్న ఫాలోయింగ్‌ని జనసేనకు ప్లస్ చేయాలనుకుంటున్నాడు. మరి పవన్ ఫాలోయింగ్ ముందు మనోడి ఫాలోయింగ్ ఎంత చెప్పండి.. అంటే అభిమానం వేరు రాజకీయం వేరు ఈ విషయం గతంలో చాలాసార్లు నిరూపితమైంది. మరి జబర్దస్త్ స్టార్ హైపర్ ఆది ప్రచారం ఏమేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి మరి..
ప్రచారంలోకి దిగిన హైపర్ ఆది.. పవన్ లాగానే ఎర్ర తువాలు..
-