ఎకనామిక్ ఇండెక్స్ , గ్రోత్ ఇండెక్స్, లైఫ్ ఇండెక్స్ ఈ విధంగా చాలా సూచీలూ సూచికలూ ఉన్నాయి. పాలకుల చేతిలో అవి పాచికలు లేండి.. వాళ్లు ఎలా అంటే అలా అవి కదులుతాయి.మెదులుతాయి. రిజల్ట్ చూపిస్తుంటాయి. తెలంగాణ వాకిట అభివృద్ధి అదుర్స్ అని .. నిన్నటి వేళ గ్రోత్ రేట్ అన్నది దేశంలోనే నంబర్ 1 ఉందని సీఎం కేసీఆర్ చెప్పడం బాగుంది కానీ ఆ స్థాయికి తగ్గ విధంగా అభివృద్ధి లేదన్నది ఓ విమర్శ. ఇదే వాస్తవం కూడా ! తెలంగాణలో అప్పుల కొట్లాట అయితే నిరంతరాయంగా సాగుతోంది. అయినా కూడా ఇది బంగారు తెలంగాణ.. ఇక్కడ అప్పులూ ఉండవు.. ఆత్మహత్యలూ ఉండవు అని చెప్తున్నారే !
అంటే అర్థం కాని, బుర్రకు అందని ఎకనామిక్స్ టెర్మినాలజీని ఉపయోగింది కేసీఆర్ జనాలను ముఖ్యంగా మీడియాను ఆకట్టుకోవాలని చూస్తున్నారా? ఈ విధంగా ప్రశ్నిస్తే అవునని ..నిన్నటి ఆవిర్భావ వేడుకే అందుకు సాక్ష్యం అని చెప్పక దప్పదు. వృద్ధి రేటులో దేశంలోనే తెలంగాణ టాప్ అని అన్నారు. బాప్ రే అనిపించారు. ఆర్థిక వృద్ధి రేటు అంత బాగుంటే అప్పుల కోసం తిప్పలు ఎందుకు ? జీత భత్యాల కోసం 14 వేల కోట్ల రూపాయలు కావాలని కేంద్రాన్ని అడగడం ఎందుకు ?
ఏదేమయినా కేసీఆర్ ఉద్యమంలో ఉన్నంత కాలం ఉద్యమ భాష మాట్లాడి అందరినీ ఆకట్టుకునే వారు. కాస్తో కూస్తో ఆంధ్రోళ్లనీ ఆలోచనలో పడేసేవారు. కానీ ఇప్పుడు ఆయన దగ్గర సైద్ధాంతిక స్ఫూర్తి సూది మొనంత కూడా లేదు. ఏం అడిగినా తెలంగాణ దేశానికే అన్నం పెడుతుందని అంటారు. కానీ ధాన్యం కొనుగోలు చేయాలంటే మాత్రం కేంద్రమే దిక్కు అని నానా యాగీ చేస్తారు అని అంటోంది బీజేపీ. ఈ నేపథ్యంలో ఆవిర్భావ పండుగలో కొన్ని నిజాలు మాట్లాడితే బాగుంటుంది అన్నది కూడా విపక్షం వాయిస్. కానీ కేసీఆర్ మాత్రం ఎప్పటిలానే అనేక రంగాల్లో దేశంలోనే నంబర్ ఒన్ అని సొంత పత్రిక నమస్తే తెలంగాణతో సహా వివిధ మీడియాలకూ యాడ్స్ ఇచ్చారు. అనేక రంగాల్లో అన్నారు కానీ అన్ని రంగాల్లో అన్న పదం అయితే వాడలేదు అదే సంతోషం.
రాష్ట్రంలో తాగునీటి కోసం యుద్ధాలే లేవా? ఇదైతే అన్యాయం సర్..ఇప్పటికీ ట్యాంకర్ల ద్వారా రెండు రోజులకు,మూడు రోజులకు ఒక సారి నీరందుకుంటున్న పల్లెలున్నాయి చూడండి సర్ అని అంటోంది విపక్షం. అయ్యో! నిజాలు చెప్పండి ప్లీజ్ ! ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్న వాటర్ ప్లేస్ లో సురక్షిత మంచినీరు అందించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం విస్మరించిన దాఖలాలు ఉన్నాయని అంటున్నారు విపక్ష నాయకులు. అంతా బాగే అన్నీ బాగే అని చెప్పడంలో అర్థం లేదు ఔచిత్యం అంతకన్నా లేదన్న మాట కూడా ఆయా వర్గాల నుంచి అనగా విపక్ష వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. కాళేశ్వరం కారణంగా సొంత కంపెనీలే బాగుపడ్డాయి కానీ ప్రజా క్షేమం మరియు ఇతరేతర ప్రయోజనం మాత్రం పట్టకుండానే ఆ ప్రాజెక్టు ఉందని అంటున్నారు. ఏదేమయిన బలమైన కేంద్రం..బలహీన రాష్ట్రం అన్న కొట్లాటతో కేంద్రం పోతుందని కేసీఆర్ చెప్పి, త ప్పులేవీ తనవి కాదని అవన్నీ కేంద్రానివే అని చెప్పి
తన ఆవిర్భావ ప్రసంగాన్ని ముగించడం ఈ వేళ నోచుకున్న లేదా నమోదయిన విశేషం అని అంటోంది విపక్ష శ్రేణి.