తెలంగాణ లో వరుసగా జరుగుతున్న ఎన్నికలు అధికార పార్టీ టిఆర్ఎస్ ను కంగారు పెట్టిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో కేసీఆర్ కంగారు పడుతున్నారు.gress మరోవైపు చూస్తే బీజేపీ రోజురోజుకు బలోపేతం అవుతూ వస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికలలో గెలిచిన తర్వాత నుంచి బిజెపి ఊహించని విధంగా బలపడుతూ వస్తుండడం, గ్రేటర్ ఎన్నికలలో 48 స్థానాలను దక్కించుకునే స్థాయికి బిజెపి బలపడడం వంటి పరిణామాలు మరింత ఆందోళన పెంచుతున్నాయి. అదీకాకుండా 2022 లో ఎన్నికలు వస్తే బీజేపీకి అధికారం దక్కే ఛాన్స్ ఉన్నట్టుగా వివిధ సర్వేలు బయటపడడం, వంటి పరిణామాలు నిద్రలేకుండా చేస్తున్నాయి.
దీంతో టీఆర్ఎస్ కూడా జానారెడ్డిని చేర్చుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ నోముల నర్సింహయ్య కుటుంబ సభ్యుల్లో ఒకరికి టికెట్ ఇవ్వాలా లేక ఇదే నియోజకవర్గంలో మరో బలమైన నాయకుడికి కానీ, బయట నియోజకవర్గంలోని గెలుపు గుర్రానికి టికెట్ ఇవ్వాలా అనే విషయంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి కసరత్తు చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో వాస్తవ పరిస్థితులు, ఎవరికి టిక్కెట్ ఇస్తే గెలుపు టిఆర్ఎస్ ఖాతాలో పడుతుంది ? ఇలా అనేక అంశాలపై పూర్తిస్థాయిలో సర్వే చేయించేందుకు టిఆర్ఎస్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.