ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కెసిఆర్ బంపర్ న్యూస్…!

-

ఇన్నాళ్ళు ఆర్ధికంగా ఇబ్బంది పడిన తెలంగాణా ఇప్పుడు నిలబడుతుంది. ఆదాయం క్రమంగా పెరగడంతో తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. నిధుల కొరత ఉన్న నేపధ్యంలో ఆచితూచి వ్యవహరిస్తున్న తెలంగాణా ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ దూకుడు పెంచాలని భావిస్తుంది. ఇన్నాళ్ళు కొన్ని వర్గాల్లో అక్కడక్కాడా అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తిని అధిగమించే ప్రయత్నాలు చేస్తుంది తెలంగాణా సర్కార్.

ఉద్యోగులు, పెన్షన్ దారులు, చిన్న చిన్న ఉద్యోగులు ఇలా అందరికి న్యాయం చెయ్యాలని భావిస్తుంది. పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల మీద కూడా దృష్టి పెడుతుంది తెలంగాణా ప్రభుత్వం. త్వరలో బడ్జెట్ ప్రవేశ పెడుతుంది కెసిఆర్ సర్కార్. దీనితో బడ్జెట్ లో ఏయే నిర్ణయాలు ఉంటాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధుల కోసం తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా నియోజకవర్గ అభివృద్ధి పథకం అనేది ఒకటి కొనసాగుతుంది. ఈ పథకం కింద ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం ప్రత్యేక౦గా ప్రతీ ఏటా నిధులు కేటాయిస్తూ ఉంటారు. ఈ నిధులను తమ నియోజకవర్గంలోని అభివృద్ధి పనులకు సొంతగా ఖర్చు చేసే అధికారం ఉంటుంది. తెరాస ప్రభుత్వ౦ తొలిసారి ఏర్పడినప్పుడు తొలి నాలుగేళ్ళు ఇచ్చారు. సీడీఎఫ్ పథకం రద్దు అయ్యే నాటికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఏటా రూ.1.5 కోట్లు నిధులు కేటాయించారు.

రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ లో సీడీఎఫ్ పథకాన్ని కెసిఆర్ ప్రభుత్వం రద్దు చేసింది. దీనితో ఇప్పట్లో నియోజకవర్గాలకు నిధులు ఉండవని భావించారు. ఇప్పుడు మళ్ళీ ఆర్ధికంగా బలపడటంతో పథకం ప్రవేశ పెట్టాలని భావిస్తున్నారు. ప్రతీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం 15 రోజుల్లో ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ లో రెండు కోట్ల వరకు నిధులు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version