మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో రేపు తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. రేపు ముంబై వెళ్లనున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ కు ఉద్ధవ్ ఠాక్రే ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. ముంబై వచ్చి తమ ఆతిథ్యం స్వీకరించాల్సిందిగా ఆహ్వానించారు. లంచ్ మీటింగ్ లో ఇరు నేతలు కలుసుకోనున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం, బీజేపీకీ వ్యతిరేఖంగా కేసీఆర్ గళమెత్తారు. కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. కేసీఆర్ పోరాటానికి మద్దతు ప్రకటించారు.
రేపు ముంబైకి కేసీఆర్.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ
-