ఆదిలాబాద్‌ లో అరుదైన ఘటన.. రైతుల ఖాతాల్లో 3 నెలల నుంచి లక్షల్లో డబ్బులు జమ

-

ఆదిలాబాద్ జిల్లాలో వింత చోటు చేసుకుంది. ఆ జిల్లా కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు చెందిన ముగ్గురు ఖాతాదారుల అకౌంట్లలో లక్షల్లో డబ్బులు అవుతోంది. ఆ జిల్లాకు చెందిన ముగ్గురు గిరిజన రైతుల కిసాన్ క్రెడిట్ కార్డు ఖాతాలో లక్షల రుపాయలు జమ అయ్యాయి. ఇప్పటి వరకు మూడు ఖాతాలలో కోటికిపైగా డబ్బులు జమ అయ్యాయి. సల్పగూడ గిరిజన మహిళ ఖాతాలో తోమ్మిది లక్షల 50 వేలు జమ కాగా.. మరోక ఇద్దరి ఖాతాలలో లక్షల రూపాయలు జమ అయ్యాయి.

అయితే.. ఆ డబ్బులను చాలా తెలివిగా… కస్టమర్ సర్వీస్ పాయింట్ (csp) నుండి విత్ డ్రా చేస్తున్నారు. మూడు నెలలుగా ఈ డబ్బుల డ్రా జరుగుతున్నప్పటికీ…. బ్యాంక్ అధికారులు ఇప్పటి వరకు గుర్తించలేదు. అయితే.. తాజాగా ఈ స్కాం ను బ్యాంకు అధికారులు గుర్తించారు.

మామిడి గూడ సీఎస్పి ద్వారా ఇప్పటి వరకు కోటి 28 లక్షల 78 వేలు డ్రా అయినట్టు గుర్తించారు అధికారులు. అయితే.. డబ్బులు ఎలా వచ్చాయి ? డబ్బులు ఎక్కడివి ? అనేది మిస్టరీ గానే ఉండి పోయింది. ఇక అటు రికవరీ కోసం తమను వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గిరిజన రైతులు. ఈ సంఘటన గురించి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version