మండలి రద్డుకి సిద్దమైన‌ సీఎం జ‌గ‌న్‌.. సోమ‌వార‌మే ముహూర్తం..?

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండలి రద్డుకి సిద్దమయ్యారు. ఎలా అయినా సరే శాసన మండలిని రద్దు చెయ్యాలని భావిస్తున్న ఆయన మూడు రోజుల నుంచి న్యాయ, రాజకీయ నిపుణులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ సాధ్యాసాద్యాలను పరిశీలిస్తున్నారు. ఈ నేపధ్యంలో సోమవారం మండలిని రద్దు చేయడానికి ముహూర్తం ఖరారు చేసారు.

ఈ నేపధ్యంలో సోమవారం మండలి రద్దు తీర్మానాన్ని కేబినేట్ లో ఆమోదించి శాసన సభలో చర్చ జరిపి.. బిల్లుని ఆమోదించి కేంద్రానికి పంపనున్నారు. ఇక రేపు ఉదయం 9;30 కేబినేట్ భేటీ జరగనుంది. దీంతో ఏపీ శాసన మండలి రద్దుకు కౌంట్‌డౌన్ మొదలయినట్లే కనబడతోంది. కాగా, దేశంలో కేవలం 6 రాష్ట్రాల్లోనే మండళ్లు ఉన్నాయని.. రోజుకు కోటి రూపాయలు ఖర్చయ్యే మండలి మనలాంటి పేద రాష్ట్రానికి అవసరమా? అని ప్ర‌శ్నించిన సంగ‌తి తెలిసిందే. శాసన మండలి అనేది సూచనలు, సలహాలు తీసుకోవడానికి మాత్రమేనన్న సీఎం.. ఇది తప్పనిసరేం కాదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version