సీఎం జగన్‌ హామీ.. క్షణాల్లో పరిష్కారం

-

ప్రజాసమస్యల పరిష్కారానికి వైసీపీ ప్రభుత్వం ఏ మేరకు కట్టుబడి ఉందో తెలియజెప్పే సంఘటన ఇది. స్వయంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇవ్వగా బాధితులకు కేవలం గంటలోనే అధికారులు న్యాయం చేయగలిగారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఈ కార్యక్రమానికి వేదికైంది. ఫలితంగా తొమ్మిది మంది అర్జి దారులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున తొమ్మిది లక్షల రూపాయలను చెక్కుల రూపంలో పంపిణీ చేశారు కలెక్టర్‌ ప్రశాంతి. ఈ సంఘటనతో లబ్ధిదారులు వైసీపీ ప్రభుత్వాన్ని ముఖ్యంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని వేనోళ్ళ కొనియాడుతున్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం భీమవరం పరిరక్షణ సందర్భంగా పలువురి సమస్యలను విన్నారు. వారిని తక్షణం ఆదుకోవాలని కలెక్టర్‌ ప్రశాంతికి ఆదేశాలిచ్చారు.9 మంది అర్జీదారుల సమస్యలను విన్నాక వారికి చెక్కులను అందించారు కలెక్టర్‌ ప్రశాంతి.స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సదరు 9 మంది అర్జి దారులకు లక్ష రూపాయలు చొప్పున చెక్కులను జాయింట్ కలెక్టర్ ఎస్. రామ సుందర్ రెడ్డి తో కలిసి అందజేశారు.

చెక్కులు అందుకున్న వారి వివరాలు ఇలా ఉన్నాయి..

నరసాపురం మండలం ఎల్ బి చర్ల గ్రామం కడలి నాగలక్ష్మికి భూసమస్య పరిష్కారంలో భాగంగా పరిహారం అందజేశారు.అలాగే 29వ వార్డుకి చెందిన ఎల్లమల్లి అన్నపూర్ణ భర్త చనిపోగా ఆమెకు ఆర్థిక సహాయం అందజేశారు.ఎలమంచిలి మండలం బోడ్డి పట్ల గ్రామానికి చెందిన చిల్లి సుమతి కుమారుడి కిడ్నీ సంబంధిత వైద్యం కోసం ఆర్ధిక సాయం అందించారు.

వైద్య సహాయం నిమిత్తం శ్రీరామవరం గరామానికి చెందిన కంతేటి దుర్గ భవానికి, భర్త మరణించడంతో ఒంటరిగా జీవిస్తున్న తేతలి గీతకు వైద్యఖర్చుల నిమిత్తం లక్ష రూపాయల చెక్కును అందించారు.పూళ్ళ గ్రామానికి చెందిన అరుగుల లాజరస్‌కు, తిరుపతి పురం గ్రామానికి చెందిన గుడాల అపర్ణ జ్యోతికి, పొలసానపల్లి గ్రామానికి చెందిన కోరాడ వీర వెంకట సత్యనారాయణకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు.

జగన్ విశ్వసనీయతకు మారు పేరు అని అంటారు.మాట ఇచ్చారంటే చేసి చూపిస్తారనే నమ్మకం కూడా ఉందంటారు.ఇప్పుడు సీఎం మానవత్వాన్ని స్వయంగా చూస్తున్నామని లబ్ధిదారులు చెప్తున్నారు.ఆ క్రెడిబిలిటీయే ఆయనను రాజకీయల్లో బలోపేతం చేస్తోంది. జగన్ ఎక్కడికి వెళ్ళినా ఆర్తులు ఇబ్బందులలో ఉన్న వారూ ఆయన కోసం ఎదురుచూస్తూంటారు.ఇలా వచ్చిన వారిని ఎవరినీ నిరాశకు గురి చేయకుండా జగన్ అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version