జగన్ ఎప్పుడు..తాను పేదల మనిషి అని చెబుతూనే ఉంటారు.. పేద, మధ్య తరగతి కుటుంబాలకు జగన్ అండగా ఉంటారు. అందుకే ఎప్పుడు ఆయన నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అని చెబుతారు. ఇక వారి కోసం ఎంతవరకైనా వెళ్తారు..ఏదైనా చేస్తారు. కరోనా లాంటి సమయంలో కూడా పేదల పక్షాన నిలబడి వారికి అండగా నిలబడ్డారు. అయితే ప్రతిపక్షాలు ఎప్పుడు ఆయనపై ఏదొక రకంగా విమర్శలు చేస్తూనే ఉంటారు. జగన్ వచ్చాక ఏపీ నాశనం అయిందని, ప్రజలని పీక్కు తింటున్నారని, పథకాల రూపంలో రూపాయి ఇచ్చి..పన్నుల రూపంలో పది రూపాయిలు లాగేసుకుంటున్నారని విమర్శలు చేస్తారు.
కానీ అవన్నీ తప్పు అని మరోసారి రుజువైంది. జగన్ అంటే పేదల పెన్నిధి అని తేలిపోయింది. ఆయన ఎప్పుడు పేదల పక్షం ఉంటారని తెలిసింది. ఆయన పాలనలో రాష్ట్రంలో పేదరికం సగంపైనే తగ్గడమే దానికి నిదర్శనం. తాజాగా కేంద్ర రిలీజ్ చేసిన గణాంకాలు చూస్తే అదే నిజమని తేలింది. 2016లో ఆంధ్రాలో పేదరికం 11.7 శాతం ఉండగా 2021 నాటికి అది 6.06 శాతానికి తగ్గింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే 2016 నాటికి 14.72 శాతం పేదరికం ఉండగా అది 2021 నాటికి 7.71 శాతానికి తగ్గిందని, అదే సమయంలో పట్టణ ప్రాంత పేదరికం 4.63 శాతం నుంచి 2.20 శాతానికి తగ్గినట్లు కేంద్రప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ వెల్లడించింది.