తెలంగాణలో బీజీపీ దూకుడుగా ఉందనే సంగతి తెలిసిందే…టీఆర్ఎస్ కు చెక్ పెట్టడమే లక్ష్యంగా బీజేపీ ముందుకెళుతుంది..తెలంగాణలో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ పయనిస్తుంది..సరే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఎవరు అధికారంలోకి వస్తారు? అనే విషయం పక్కన పెట్టేస్తే..అసలు బీజేపీ గాని అధికారంలోకి వస్తే ఎవరు సీఎం అవుతారు? ఈ ప్రశ్నపై రకరకాల చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ సీఎం అవుతారు…లేదు ఆయన కాదు అనుకుంటే కేటీఆర్ అవుతారు…ఇందులో క్లారిటీ ఉంది. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి, భట్టి విక్రమార్క లాంటి వారు కనిపిస్తారు…అయితే వీరిలో ఎవరు అవుతారో క్లారిటీ లేదు. ఇటు బీజేపీలోకి వస్తే..సీఎం రేసులో బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఇంకా కొందరు సీనియర్ నేతల పేర్లు వినిపిస్తున్నాయి.
సీఎం పదవి ఎవరు వదులుకోవడానికి ఇష్టపడరు…మరి అదేంటో ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న బండి సంజయ్ మాత్రం తాను సీఎం అవ్వను అని చెప్పేస్తున్నారు..అసలు తనకు సీఎం అవ్వాలనే ఉద్దేశం లేదని అనుకుంటున్నట్లు చెప్పుకొస్తున్నారు. అంటే కిషన్ రెడ్డి, తనకు ఏమన్నా విభేదాలు ఉన్నాయనే ప్రశ్నలు వస్తున్న నేపథ్యంలో బండి వివరణ ఇస్తూ… రేపు పార్టీ అధికారంలోకి వస్తే సీఎం కావడం కోసం..తాను సీఎంను కానని స్పష్టంగా చెప్పానని, తన దృష్టిలో సీఎంను చేసినోడే గొప్పోడు అని, తాను సీఎంను పక్కా చేస్తానని అంటున్నారు.
అంటే బండి మాత్రం సీఎం అవ్వను అని క్లారిటీగా చెప్పేస్తున్నారు..వేరే వాళ్ళని సీఎం చేస్తానని అంటున్నారు. అయితే ఇక్కడ నిజంగా మనసులో మాట బండి చెప్పారా? లేక అధిష్టానాన్ని ఆకట్టుకోవడానికి ఇలా మాట్లాడారనేది క్లారిటీ లేదు. కానీ ఏదేమైనా ఎన్నికలకు ముందే బీజేపీలో సీఎం అభ్యర్ధిని ప్రకటిస్తే పార్టీకి కాస్త బెనిఫిట్ ఉంటుందని చెప్పొచ్చు…ప్రజలకు ఓ బలమైన నాయకత్వం కనిపిస్తేనే..బీజేపీకి ప్లస్..మరి చూడాలి బీజేపీలో సీఎం క్యాండిడేట్ ఎవరో?