ఈటెల జమునకు కలెక్టర్ కౌంటర్.. అవి కబ్జా భూములే

-

జామున హేచరిస్ భూ వ్య‌వ‌హారం పై ఈటల జ‌మున చేసిన కామెంట్స్ కు మెదక్ జిల్లా కలెక్ట‌ర్ హ‌రీష్ కౌంట‌ర్ ఇచ్చాడు. ఈట‌ల జ‌మున చ‌ట్ట విరుద్ధం గా భూమి ని కొనుగోలు చేశార‌ని స‌ర్వే నంబ‌ర్ 130 లో అసలు ప‌ట్టా భూమి లేద‌ని అన్నారు. దీనిని క‌బ్జా చేశార‌ని అన్నారు. ఈటెల జామున కొనుగోలు చేసిన 3 ఎకరాలు చట్ట విరుద్ధమైనవి అని అన్నారు. ఆ భూమి పై ఎలాంటి హక్కు లేని రామ రావ్ దగ్గర నుండి కొనుగోలు చేశారని అన్నారు. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా చట్ట విరుద్ధమ‌ని అన్నారు. అలాగే ఈ భూమి లో అక్ర‌మం గా పౌల్ట్రీ షేడ్ లు నిర్మించారని తెలిపారు.

అసలు స‌ర్వే నెంబ‌ర్ 130 లో ఉంది అసైన్డ్ భూమి అని తెల్చారు. ఈ సర్వే నంబర్ లో గ‌ల‌ అసైన్ భూమిని 11 మంది అసైన్ దారులద‌ని తెలిపారు. అలాగే ఈ భూమిని అక్రమంగా కొనుగుళ్లు చేసి తెల్లకాగితల‌లో లావాదేవీల చేసిన‌ట్టు రికార్డులు ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశారు. భూముల సర్వే సమయంలో కూడా జామున హేచరిస్ ప్రతినిధులు పంచనామా లో సంతకాలు చేశారని గుర్తు చేశారు. అలాగే సర్వే 81 లో కూడా భూమి లేని 7గురికి అసైన్డ్ చేయబడిందని అన్నారు.

ఈ సర్వే నంబర్ లో ఉన్న చేసిన 5 ఎకరాల 36 గుంటల భూమిని జ‌మున‌ చట్టవిరుద్దం గా రిజిస్ట్రేష‌న్ చేసుకుంద‌ని అన్నారు. ఈ భూమి పై ఎలాంటి హక్కు లేని శ్రీరామరావు నుంచి కొనుగోలు చేసిన‌ట్టు ఉంద‌ని అన్నారు. ఈ భూమి మొత్తం 2011 నుంచి నిషేధిత ఆస్తుల జాబితాలో ఉంద‌ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version