టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని ఇటీవల ప్రతి సభలో సీఎం జగన్ ప్రజలకు చెప్తున్నారు. అందుకు తగినట్టుగానే వ్యవహరిస్తున్నారు చంద్రబాబు నాయుడు.పేదలపై మరోసారి జూలుం ప్రదర్శించారు ఈ సీనియర్ రాజకీయ నేత.వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు నిలిపివేయాలని ఏకంగా ఈసీకి ఫిర్యాదు చేశారు.దీంతో జగనన్న పాలనలో అమలు చేస్తున్న పథకాలను నిలిపివేసింది ఎన్నికల కమిషన్.చంద్రబాబు పేదలపై పగపట్టాడు అనేందుకు ఇది మరొక ఉదాహరణ.
పేదలకు సంక్షేమ పథకాలను ఇవ్వకుండా అడ్డుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబునాయుడు. మొన్నటికి మొన్న వృద్దులకు పెన్షన్లు అందకుండా చేసిన చంద్రబాబు ఇపుడు జగనన్న ప్రభుత్వం అందిస్తున్న పథకాలను పేదలకు చేరకుండా అడ్డుకుంటున్నాడు. జగనన్న ప్రభుత్వంలో అమలవుతున్న విద్యార్ధుల ఫీజు రీ ఎంబర్స్ మెంట్, విద్యాదీవెన, ఇన్ పుట్ సబ్సిడీ వంటి పథకాలను పేదలకు చేరకుండా ఈసీకి ఫిర్యాదులు చేసి పేదల జీవితాలతో ఆటలాడుకుంటున్నాడు.దీంతో సంక్షేమ పథకాలకు నిధులు విడుదల కాకుండా ఈసీ కి ఫిర్యాదు చేశాడు.ఫలితంగా తుఫాను, కరువు కారణంగా దెబ్బతిన్న రైతులకు అందే సబ్సిడీ ఇవ్వడానికి ఈసీ మోకాలడ్డింది.
చంద్రబాబు చేసే ప్రయత్నాలలో అన్ని వర్గాలు ఇబ్బందులకు గురవుతున్నారు.ముఖ్యంగా రైతులు ఖరీఫ్ కు సన్నద్దమవుతున్న వేళ వారికి అందాల్సిన సబ్సిడీ చంద్రబాబు వలన నిలిచిపోయింది.విద్యార్ధులకు ఇచ్చే ఫీజు రీయంబర్స్ మెంట్ నిధులు కూడ నిలిచిపోయాయి.దీంతో అన్నివర్గాల వారు చంద్రబాబుపై మండిపడుతున్నారు.
చంద్రబాబును తరిమేసే రోజులు దగ్గర పడ్డాయని, మరో నెల రోజులు ఓపిక పడితే మళ్ళీ జగనన్న పాలనలో పేదల జీవితాల్లో వెలుగులు వస్తాయని ప్రజలు అంటున్నారు. చంద్రబాబుని ఈ ఎన్నికల్లో గెలవనివ్వబోమని చెప్తున్నారు. జగన్ ని మళ్లీ గెలిపించుకుంటామని ధీమా వ్యక్తపరుస్తున్నారు.