బీజేపీ ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న‌లు

-

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ ప్ర‌భుత్వం వ‌డ్ల ను కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేస్తూ గురువారం ఆందోళ‌న ల‌కు బీజేపీ రాష్ట్ర నాయ‌కత్వం పిలుపునిచ్చింది. గురువారం అన్ని జిల్లా కార్యాల‌యాల ముందు ఆందోళ‌న‌లు చేయాల‌ని బీజేపీ రాఊ నాయ‌క‌త్వం కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపు నిచ్చింది. అయితే ఈ నెల 12 న రాష్ట్రంలో ఉన్న అన్ని మండ‌ల కేంద్ర‌ల తో పాటు ప్ర‌తి చోట కేంద్ర ప్ర‌భుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేస్తూ టీఆర్ ఎస్ పార్టీ ఆందోళ‌న ల కు పిలుపును ఇచ్చింది.

అయితే టీఆర్ ఎస్ కు పోటీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఈ నిర్ణ‌యం తీసుకుంది. అయితే గ‌త కొద్ది రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ ఎస్, బీజేపీ ల మ‌ధ్య వ‌డ్ల కొనుగోలు విష‌యం లో మాటల యుద్ధం కొన‌సాగుతుంది. ఒక‌రిని మించి మ‌రొక్క‌రు ప్రెస్ మీట్ లు పెడుతూ వ్య‌క్తిగ‌త దూష‌ణాలు చేసుకుంటున్నారు. అయితే యాసంగీ నుంచి తెలంగాణ నుంచి వ‌డ్ల ను కొనుగోలు చేయ‌మ‌ని కేంద్రం చెబుతుంద‌ని టీఆర్ ఎస్ వాద‌న. అయితే తెలంగాణ ముఖ్య మంత్రి అబ‌ద్ధాలు ఆడుతున్నారని బీజేపీ వాద‌న‌. ఇలా ఒక‌రిని మించి ఒక‌రు.. పోటీగా ఆందోళ‌న‌లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news