ఎలక్షన్ టీం రెడీ..కానీ కాంగ్రెస్‌లో అదే టెన్షన్..!

-

తెలంగాణలో ఈ సారి ఖచ్చితంగా గెలిచి అధికారం సొంతం చేసుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఎలక్షన్ టీం రెడీ అయింది. టి‌పి‌సి‌సి అధ్యక్షుడు ఛైర్మన్ గా కాంగ్రెస్ లో సీనియర్లు టీం మెంబర్లుగా కమిటీ ప్రకటించారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ అధికారానికి దూరమై 10 ఏళ్ళు కావొస్తుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించలేదు. తెచ్చిన పార్టీగా బి‌ఆర్‌ఎస్‌ని ఆదరించారు. కే‌సి‌ఆర్‌ని సి‌ఎం చేశారు.

అయితే కే‌సి‌ఆర్ పాలనలో తెలంగాణకు న్యాయం జరగలేదని, అందుకే తమకు ఒక అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ కోరుతుంది. ఇక ఈ సారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం చాలా ముఖ్యం..లేదంటే ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది. అందుకే పార్టీ గెలుపు కోసం విభేదాలని సైతం పక్కన పెట్టి నేతలు కలిసికట్టుగా పనిచేయడానికి రెడీ అయ్యారు. ఎన్నికల టీంగా ఏర్పడి..పార్టీ గెలుపు కోసం పనిచేయనున్నారు. ఇక ఈ ఎన్నికల టీంలో రేవంత్ రెడ్డి ఛైర్మన్ గా ఉండగా.. భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, గీతారెడ్డి, అజహరుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, జానారెడ్డి, హనుమంతరావ్, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి,  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీ గౌడ్, శ్రీధర్ బాబు, సంపత్ కుమార్, రేణుకా చౌదరి, పొదెం వీరయ్య, సీతక్క, షబ్బీర్ అలీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావ్, సునీతా రావ్ ముదిరాజ్..వీరంతా టీంలో ఉన్నారు.

అయితే టీం పరంగా అంతా బాగానే ఉంది..కానీ వీరు ఎంతవరకు కలిసికట్టుగా పనిచేస్తారనేది డౌట్. ఎందుకంటే వీరిలో వీరికే పడదు. అలాగే ఇందులో జగ్గారెడ్డి లాంటి వారు యాక్టివ్ గా లేరు. మరి చూడాలి ఈ ఎన్నికల టీం కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొస్తుందో లేదో.

Read more RELATED
Recommended to you

Exit mobile version