భారత రాష్ట్ర సమితి పార్టీలో కీలక నేతగా రాజ్యసభ సభ్యులుగా ఉన్న కే కేశవరావు ఇటీవల పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు.. రాజ్యసభ పదవిని సైతం త్యాగం చేశారు.. బిఆర్ఎస్ లో ఆయనకి తగిన ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ.. తన వారసుల రాజకీయ భవిష్యత్తు కోసమే సొంతగూటికి వెళుతున్నట్లు కేకే ప్రకటించారు. కాంగ్రెస్ ద్వారానే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని పార్టీ వీడే సమయంలో ఆశాభావం వ్యక్తం చేశారు.. అంతవరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు కేశవరావు రాజకీయ జీవితం డైలమాలో పడిందనే ఆందోళన ఆయన అభిమానులు కనిపిస్తోంది..
ఆయన రాజీనామాతో ఖాళీ ఏర్పడ్డ రాజ్యసభ పదవిని.. తిరిగి ఆయనకే కట్టబెడతారని అందరూ భావించారు.. అందుకే కేకే పార్టీ విడారనే ప్రచారం కూడా జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ దిశగా ఆలోచనలు కూడా చెయ్యలేదట.. కేకే రాజీనామాతో ఖాళీ పడిన స్థానానికి అభిషేక్ మను సింఘ్విని ఆ పార్టీ రాజ్యసభ కు పంపబోతుంది.
పార్టీలో చేరే సమయంలో కేశవరావ్ కి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీ ఇవ్వలేదని పార్టీలో టాక్ నడుస్తుంది.. కేశవరావ్ వారసులకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామని అధిష్టానం నుంచి హామీ వచ్చిందని.. అందుకే అయన రాజ్యసభకి రాజీనామా చేసారని అయన అభిమానులు చర్చించుకుంటున్నారు.. కాంగ్రెస్ పార్టీ తనకు మాతృ సంస్థ అని చెప్పుకుంటున్న కేశవరావుకి.. ఆ పార్టీనే షాక్ ఇచ్చిందనే ప్రచారం జరుగుతుంది.. పార్టీ అవసరాల దృష్టి అభిషేక్ మను సింఘ్విని రాజ్యసభకి పంపాల్సిన వచ్చిందని..కేకేకి కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా తగిన గుర్తింపు ఇస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.. కేకే ని కాంగ్రెస్ పార్టీ ఎలా సంతృప్తి పరుస్తుందో చూడాలి మరి..