తెలంగాణలో బీజేపీకి బలం లేదనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆ పార్టీ ఇప్పుడుప్పుడే పుంజుకుంటుంది. టీఆర్ఎస్‌పై పోరాటం చేస్తుంది. తమ బలాన్ని ఇంకా పెంచుకోవాలని చూస్తుంది. ఆ పార్టీ నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తూ..టీఆర్ఎస్‌ని ఢీకొడుతున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. అసలు బలం లేని బీజేపీలో ఈ సీన్ ఉంటే..రాష్ట్రంలో కాంగ్రెస్‌కు చెప్పుకోదగిన స్థాయిలో క్యాడర్ బలం ఉంది.
నాయకులు ఉన్నారు..దాదాపు అన్నీ నియోజకవర్గాలపై కాంగ్రెస్‌కు పట్టు ఉంది…కానీ బీజేపీ కంటే కాంగ్రెస్ వీక్‌గా కనిపిస్తోంది. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ సొంత తప్పిదాలే. టిపిసిసి అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి…ఏదొక విధంగా కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడుతూనే ఉన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి కష్టపడుతున్నారు. కానీ మిగిలిన నాయకులు రేవంత్‌కు మద్ధతుగా ఉండటం లేదు. పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేయడం లేదు.
పైగా రేవంత్‌ని కిందకు లగాడనికే చూస్తున్నారు. ఇక జగ్గారెడ్డి లాంటి వారైతే డైరక్ట్‌గా రేవంత్‌పై విమర్శలు చేస్తున్నారు. దీని వల్ల కాంగ్రెస్ పార్టీకే డ్యామేజ్ అయ్యే పరిస్తితి. అలాగే రేవంత్, కేసీఆర్ ప్రభుత్వంపై ఏవైనా పోరాటాలకు పిలుపునిస్తే, సీనియర్ల నుంచి అసలు మద్ధతు రావడం లేదు. ఇటీవల రచ్చబండ కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు రేవంత్‌ని అడ్డుకున్నారు. అప్పుడు ఏ ఒక్క సీనియర్ కూడా రేవంత్‌కు సపోర్ట్‌గా నిలవలేదు. ఉత్తమ్ కుమార్, జానారెడ్డి, కోమటిరెడ్డి, దామోదర రాజనర్సింహా, భట్టి విక్రమార్క ఇలా చెప్పుకుంటూ పోతే సీనియర్లు ఎవరు రేవంత్‌కు మద్ధతుగా నిలవడం లేదు. ఏదో ఎవరి పని వారిదే అన్నట్లు ముందుకెళుతున్నారు.
అదే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని అరెస్ట్ చేస్తే…ఆ పార్టీ నేతలు ఏ స్థాయిలో కేసీఆర్‌పై ఫైర్ అవుతున్నారో చూడొచ్చు. పైగా జాతీయ అధ్యక్షుడు సైతం రాష్ట్రానికి వచ్చి మరి తమ పార్టీకి మద్ధతుగా నిలబడ్డారు. కాంగ్రెస్‌లో మాత్రం ఈ పరిస్తితి లేదు. సీనియర్లంతా రేవంత్‌ని ముంచాలని అనుకుంటున్నారు…కానీ చివరికి కాంగ్రెస్ మునిగిపోయేలా ఉంది.