బీసీ కులగణనతో కాంగ్రెస్ కు మైలేజ్ వస్తుందా..? వ్యూహమేంటంటే..?

-

రాజకీయ పార్టీలు ఏ పథకం పెట్టినా.. ఏ హామీని ఇచ్చినా.. అది భవిష్యత్ లో తమకు ఉపయోగపడేదిగా ఉంటేనే అది అమలు చేస్తారు.. దాని మీద కసరత్తు చేస్తారు.. తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు అదే సిద్దాంతాన్ని ఫాలో అవుతోంది.. నాలుగేళ్ల నుంచే తమ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది.. బీసీ కులగణన వెనుక కూడా రాజకీయ వ్యూహముందని ప్రచారం జరుగుతోంది.. ఇంతకీ కాంగ్రెస్ స్టాటజీ ఏంటో చూద్దాం.

తెలంగాణలో బీసీలు అధికంగా ఉన్నారు..దీంతో వారిని తమవైపు తిప్పుకునేందుకు ఎన్నికల సమయంలో బీసీలకు అనేక హామీలిచ్చింది కాంగ్రెస్.. మెజారిటీ వ‌ర్గమైన బీసీల‌ను పూర్తిస్థాయిలో త‌మ‌వైపు తిప్పుకోవాల‌ని… హస్తం పార్టీ వ్యూహ‌, ప్రతివ్యూహాల‌కు ప‌దును పెడుతోంది. బీసీ కుల‌గ‌ణ‌న‌ పేరుతో… వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తెలంగాణ రాష్టం ఏర్పాటైనప్పటి నుంచి మెజార్టీ బీసీలు బీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచారు.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు ఉన్నారు.. దీంతో వారిని మరింత దగ్గరకు తీసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి కొత్త స్టాటజీని ఫాలో అవుతున్నారట..

బీసీ కులగణనను ఉపయోగించుకుని.. బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలను తమ వెంట తెచ్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారు.. బీసీ జనగణనతో.. రాజకీయంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు లబ్ధి చేకూరుతుంది.. గ‌త ఎన్నిక‌ల ప్రచారంలో రాహుల్‌ గాంధీ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. జ‌నాభా లెక్కల ప్రకారం బీసీల రిజ‌ర్వేష‌న్లు పెంచుతామ‌ని.. నిధులు కూడా జ‌నాభా ప్రకారం ఆ వ‌ర్గాల‌కు ఖ‌ర్చు పెడతామని అన్నారు. ఆ హామీని నెరేవేర్చేందుకు రాష్ట్రంలో బీసీ కుల‌గ‌ణ‌న ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి..

కాంగ్రెస్ పార్టీ ద్వారా జనగణన జరుగుతోందని.. దీని ద్వారా జరిగే లబ్ధిని.. ప్రతీ గ్రామంలో ఉండే బీసీలకు తెలియజేయ్యాలని కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలకు ఆదేశాలిచ్చిందట.. బీసీల్లో మెజారిటీ జనాలను పార్టీ వైపు తిప్పుకుంటే.. వచ్చే ఎన్నికల్లో అధికారానికి ఢోకా ఉండదని.. హస్తం పార్టీ నేతలు అంచనా వేస్తున్నారని పార్టీలో చర్చ నడుస్తోంది.. కాంగ్రెస్ పార్టీలో ఉండే బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం ఏర్పాటు చేసి..దిశానిర్దేశం చేశారట. బీసీ కులగణనను సద్వినియోగం చేసుకుని జనాల్లోకి వెళ్లాలని.. పార్టీకి మైలేజ్ తీసుకురావాలని సూచించారట.. తెలంగాణలో ఉండే సుమారు 60 శాతం ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోగలిగితే ఇక తిరుగుండదని రేవంత్ చెప్పారట.. దీనిపై బీసీ నేతలు వర్కౌట్ చేస్తున్నారు..కాంగ్రెస్ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version