వరి ధాన్యం పై నెలకొన్న సందిగ్ధత ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వరి ధాన్యం కొనుగోలు పై చేస్తున్న నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నేటి తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వార్యంలో కల్లాలోకి కాంగ్రెస్ అనే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. కల్లాలోకి కాంగ్రెస్ కార్యక్రమం లో భాగంగా ఈ రోజు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో పలు కల్లాలోను సందర్శించ నున్నారు. అలాగే తెలంగాణ లో అన్నిజిల్లాలో ఆయా జిల్లాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్లాలను
సందర్శిస్తారని కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
రైతుల వద్ద కే వెళ్లి రైతుల అభిప్రాయం తెలుసుకుంటామని వివరించిది. తెలంగాణ లో పండిన ప్రతి గింజను కొనుగోలు చేసే వరకు తమ పోరాటం కనసాగుతుందని స్పష్టం చేసింది. అలాగే తాము ఎల్లప్పుడు రైతుల పక్షనే ఉంటామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. కాగ తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ నిన్న మహా ధర్న పై కేంద్ర ప్రభుత్వం స్పందించిది. తెలంగాణ నుంచి ఎట్టి పరిస్థితుల్లో బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ లో ఆందోళనలు పెరుగుతన్నాయి.