కారుకు కాంగ్రెస్ రివర్స్ స్కెచ్..టీడీపీతో ప్లస్.!

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడింది..దీంతో ప్రధాన పార్టీలు వ్యూహ, ప్రతి వ్యూహాలతో రెడీ చేసుకున్నాయి. ఈ అంశంలో అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీ ఓ అడుగు ముందుంది. ఇప్పటికే కే‌సి‌ఆర్..115 మంది అభ్యర్ధులతో మొదట లిస్ట్ విడుదల చేశారు. దీంతో ఇంకా ఎన్నికల ప్రచారంలోకి దిగడానికి రెడీగా ఉన్నారు. అయితే ఊహించని విధంగా కే‌సి‌ఆర్..కమ్యూనిస్టులని పక్కన పెట్టారు. మునుగోడు ఉపఎన్నికలో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని గెలిచారు.

కానీ ఇప్పుడు దూరం పెట్టేశారు. అయితే కమ్యూనిస్టులు విడిగా పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందనేది కే‌సి‌ఆర్ అంచనా..అటు షర్మిల పార్టీ, బి‌ఎస్‌పి పార్టీలు సైతం విడిగా పోటీ చేస్తే ఓట్లు భారీగా చీలిపోతాయని అప్పుడు బి‌ఆర్‌ఎస్‌కు లాభమని అంచనా వేస్తున్నారు. అయితే ఆ వ్యతిరేక ఓట్ల అంశంపై కాంగ్రెస్ రివర్స్ స్కెచ్ వేస్తుంది. ఇప్పటికే షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే దిశగా వెళుతున్నారు. దీంతో అక్కడ ప్లస్. ఇటు కమ్యూనిస్టులు..కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు రెడీ అవుతున్నాయి. దీని వల్ల కూడా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది.

మరి బి‌ఎస్‌పి విషయంలో ఎలా ముందుకెళ్తారో చూడాలి. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్, టి‌డి‌పితో పొత్తు పెట్టుకుని నష్టపోయింది. కానీ ఇప్పుడు టి‌డి‌పి ఒంటరిగా పోటీ చేస్తుంది. ఇలా ఒంటరిగా పోటీ చేయడం వల్ల కాంగ్రెస్‌కు మేలు. ఎందుకంటే తెలంగాణలో టి‌డి‌పి కేడర్ చాలావరకు బి‌ఆర్‌ఎస్ వైపుకు వెళ్లింది. తాజాగా ఏ పార్టీతో పొత్తులు ఉండవని చంద్రబాబు తేల్చి చెప్పారు.

దీంతో ఒంటరిగా టి‌డి‌పి బరిలో ఉంటుంది. అయితే టి‌డి‌పికి ఒక్క సీటు కూడా గెలిచే ఛాన్స్ లేదు. కానీ కనీసం 20 సీట్లలో ఓట్లు చీల్చే ఛాన్స్ ఉంది. అది కూడా బి‌ఆర్‌ఎస్ ఓట్లే అవుతాయి. దీని వల్ల పరోక్షంగా బి‌ఆర్‌ఎస్ పార్టీకి నష్టం. కాంగ్రెస్‌కు లాభం.

Read more RELATED
Recommended to you

Exit mobile version