మీమ్స్‌లో నవ్వించిన కుక్క ఇక లేదు.. బాధలో మీమర్స్‌

-

ఎవర్ని అయినా ట్రెండింగ్‌లో పెట్టాలంటే.. మీమర్స్‌ ముందు ఉంటారు. రకరకాల ఎక్స్ ప్రెషన్లతో అనేక మీమ్స్ వాడుకలో ఉన్నాయి. అలా మీమ్స్‌లో బాగా వైరల్ అయిన శునకం ‘కబోసు’. మీమర్స్ ఎంతో ఇష్టమైన కుక్క ఇది. ఇది ఇంటర్నెట్ సెన్సేషన్ అని చెపుకోవాలి. ఓసారి ఎలన్ మస్క్ ట్విట్టర్ లోగోగా ఈ కబోసు శునకం చిత్రాన్ని పెడతారని అనుకున్నారంతా. దాని ఫోటోను కూడా ఎలన్ మస్క్ షేర్ చేశాడు. దీంతో ఈ కుక్క మరింత వైరల్‌గా మారింది. ఇప్పుడు మరోసారి ఇంటర్నెట్లో హైలైట్ అయింది. దానికి కారణం కబోసు అనారోగ్యంతో మరణించింది.

క్యాన్సర్‌తో బాధపడుతున్న దాని యజమానులు ఎప్పుడో ప్రకటించారు. దానికి ఎన్నో రకాల చికిత్సలు అందించినట్టు చెప్పారు. ఇప్పుడు దాని వయసు 18 ఏళ్లు. శునకం ఇంత వయసు వరకు బతికుండడం కూడా ఎక్కువేనట. దానికి క్యాన్సర్ కాకపోయినా అది ముసలితనంతో చనిపోయే అవకాశం ఉంది. ఈ కుక్కకు సోషల్ మీడియాలో దాదాపు 20 లక్షల మంది ఫాలోవర్లున్నారు. కబోసు గురించి ప్రపంచానికి తెలిసింది 2010లో. అప్పట్లో కొందరు మీమర్స్ కబోసు ఎక్స్ ప్రెషన్స్‌ను మీమ్స్‌గా మార్చారు. వాటిని ఎంతో మంది వినియోగించారు. ఎక్కడా చూసిన ఈ శునకం ఫోటోలే కనిపించేవి. క్రిప్టోకరెన్సీలో డాగ్ కాయిన్ కూడా ఒకటి. దాని సింబల్‌గా కబోసు ముఖాన్నే వాడారు. క్రిప్టో ప్రపంచంలో ఎనిమిదవ అతిపెద్ద క్రిప్టో కరెన్సీ డాగ్ కాయిన్. బిట్ కాయిన్ తరువాత ఎక్కువ మంతి గూగుల్ లో సెర్చ్ చేసిన క్రిప్టో కరెన్సీ డాగ్ కాయిన్. ఒకప్పుడు ఈ కుక్క ఫోటోనే ట్విటర్‌కు లోగోగా ఉపయోగించారు.

ఈ కుక్క జపాన్లో నివసించేది. 2010లో దాని యజమానులు కబోసు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అవి మంచి ఎక్స్ ప్రెషన్లతో ఉండడంతో మీమర్లు వాడేసుకున్నారు. ఇప్పటికీ ఎంతో మంది ఫోన్లలో ఈ డాగ్ మీమ్ కనిపిస్తుంది. దీని పేరు మీద ఉన్న ఇన్ స్టా ఖాతాకు ఎంతో మంది ఫాలోవర్లున్నారు. ఇందులో ఈ శునకాన్ని పెంచుకుంటున్న యజమానులు ఎప్పటికప్పుడు దాని ఆరోగ్య పరిస్థితి నెటిజన్లకు తెలియజేస్తూ వచ్చారు.

గతేడాదే అది తీవ్ర అనారోగ్యానికి గురైనట్టు చెప్పారు. తరువాత ఆరోగ్యం మెరుగుపడిందని చెప్పారు. ఇప్పుడు క్యాన్సర్ తీవ్రమై అది మరణించిందని ప్రకటించారు. ఈ కుక్కని చీమ్స్ అలియాస్ చింటూ అని కూడా పిలుస్తారు. తెలుగులో ఎక్కువ మంది ఈ శునకాన్ని చింటూ అనే పిలుస్తారు. పదేళ్లపాటూ చింటూని తెలుగు మీమర్స్ కూడా ఉపయోగించారు. ఇప్పుడు ఇది మరణించిందని తెలిసి ఎంతో మంది మీమర్స్ నివాళులు అర్పిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version