ఎన్నికల వేళ ఎన్నెన్ని చిత్రాలు చూడాలో అన్నన్ని సిత్రాలు చూసే భాగ్యం దక్కుతుంది. అమ్మా.. ఓటేయండి.. అయ్యా ఓటేయండి అంటూ కొందరు.., మెజారిటీ తగ్గితే పీక కోస్తా అంటూ కొందరు.. అది చేస్తాం.. ఇది చేస్తామంటూ కొందరు,, ఇంకొందరేమో (దాదాపుగా అందరూ) డబ్బులిచ్చి ఓట్లడగటం మనం చూశాం. అయితే ఓట్లేయకపోతే ఉద్యోగాలివ్వనని ఒకావిడ, ఓట్లేయకపోతే శపిస్తానని మరొకాయన బెదిరిస్తున్నారు. అయితే ఈ బెదిరింపులకు దిగిన ఇద్దరు కూడా బీజేపీ పార్టీకి చెందిన వారే. ఒకరేమో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి మేనకా గాంధీ కాగా, ఇంకొకరేమో ఎంపీ సాక్షి మహారాజ్.
మేనకా గాంధీ గారు సుల్తాన్‌పూర్‌లోని తురబ్ ఖానీ గ్రామంలో ప్రచారంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ఆ ప్రాంతంలో ముస్లింలు అధికంగా ఉంటారు. వారిని ఉద్ధేశిస్తూ
ముస్లింలు తనకు ఓటు వేయకుంటే వారికి ఉద్యోగాలు ఇచ్చేది లేదని, ఓటు వేయకుండా ఉద్యోగాలు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. మీరు ఓటు వేసినా… వేయకపోయినా గెలుస్తాను. అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ౩ నిమిషాల నిడివి గల ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
Women and Child Minister #ManekaGandhi on camera says:
“I am going to win for sure. If Muslims won’t vote for me and then come to ask for work, I will have to think, what’s the use of giving them jobs.”#LokSabhaElections2019 @ECISVEEP pic.twitter.com/BHG5kwjwmQ
— Khabar Bar (@Khabar_Bar) April 12, 2019
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావో లోక్‌సభ నుంచి పోటీ చేస్తున్న సాక్షి మహారాజ్ ఎన్నికల ప్రచారం చేస్తూ తనకు ఓటేయకుంటే శపిస్తానంటూ వ్యాఖ్యానించారు. మిమ్మల్ని డబ్బు, ఆస్తులు అడగటం లేదు, మిమ్మిల్ని భిక్షమడుగుతున్నా(ఓట్లు అడుతున్నా..). నేను సన్యాసిని.. మీరు (ఓటు) నిరాకరిస్తే మీ కుటుంబంలోని సుఖ సంతోషాలను లేకుండా చేస్తా.. మిమ్మల్ని శపిస్తా అంటూ భయపెట్టే ప్రయత్నం చేశారు. ఇదంతా తాను ఉట్టిగా చెబుతున్నటి కాదని పురాణాల్లోని విషయాలను దృష్టిలో పెట్టుకుని చెబుతున్నానంటూ చెప్పుకొచ్చారు.
ఇది నేటి మన రాజకీయ నాయకుల ప్రవర్తన.. ఈ రెండూ ఘటనలు బెదిరింపుల కిందికి వస్తాయంటూ ఎన్నికల కమీషన్‌కు కంప్లెయింట్ ఆశ్రయిస్తామని మిగితా పార్టీ నాయకులు చెబుతున్నారు.