ఏం బాబూ నువ్ మార‌వా.. చంద్ర‌బాబుపై ద‌ళితుల ఆగ్ర‌హం

-

దళితుల ప‌ట్ల ఏపీలో ప్ర‌తిప‌క్ష‌నేత చంద్ర‌బాబునాయుడు త‌న వైఖ‌రిని మ‌రోపారి బ‌య‌ట‌పెట్టుకున్నారు. గ‌తంలో ద‌ళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని కామెంట్ చేసిన చంద్రబాబు ఇప్పుడు కూడా అదే జులుం చూపిస్తున్నారు. ఆ మ‌ధ్య చిత్తూరు జిల్లాలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందిన సీనియ‌ర్ నేత‌, మాజీమంత్రి ప‌ర‌సార‌త్నంకు సీటు ఇవ్వ‌కుండా త‌న సామాజిక వ‌ర్గం నేత‌ల‌తో ఆయ‌న ముచ్చ‌టించిన తీరు కూడా అప్ప‌ట్లో దుమారం రేపింది. తాజాగా మ‌రోసారి అణ‌గారిన వ‌ర్గాల ప‌ట్ల చంద్ర‌బాబు త‌న త‌త్వాన్ని బ‌య‌ట‌పెట్టుకున్నారు. దళిత, అణగారిన వర్గాలు రాజకీయంగా ఎదగడం ఇష్టం లేని చంద్రబాబు అవసరం వచ్చినప్పుడల్లా వారిని అవమానిస్తూనే ఉన్నారు.

సింగనమల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం అభ్య‌ర్ధిగా టిప్పర్ డ్రైవర్ రామాంజనేయులు.. మడకశిర అభ్య‌ర్ధిగా ఉపాధిహామీ కూలీ లక్కప్పను అభ్యర్ధిగా సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఎంపిక చేసారు. అత్యంత సాధారణమైన వాళ్ళను చట్టసభలకు పంపడం ద్వారా తనకు పేదలు అంటే ఎంత ముఖ్యమో జగన్ ఈ ఎంపిక‌తో స్ప‌ష్టం చేశారు. గతంలో ఇలాగే అత్యంత సాధారణ వ్యక్తులైన మాధవి, నందిగం సురేష్ లను ఎంపీలుగా గెలిపించడం ద్వారా తాను పేదలు, అణగారిన వర్గాల పక్షపాతిని అని చాటి చెప్పారు. కానీ చంద్ర‌బాబు మాత్రం దీనిని పెద్ద త‌ప్పిదంగా ప‌రిగ‌ణిస్తున్నారు. పేద‌లు ముఖ్యంగా ద‌ళితులు చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్ళ‌కూడ‌ద‌నే అక్క‌సుతో ర‌గిలిపోతున్నారు.

2024 జ‌న‌ర‌ల్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇప్పుడు కూడా పేదవర్గాలను ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించి సీఎం జగన్ తన వైఖరిని వెల్లడించారు. దీన్ని కూడా చంద్రబాబు అవహేళన చేస్తున్నారు. ఒక టిప్పర్ డ్రైవరుకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తారా అని బాబు చేసిన కామెంట్స్ పట్ల ఆయా దళిత వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. చంద్రబాబేమో సుజనా చౌదరి.. సీఎం రమేష్ వంటి డబ్బున్న పెత్తందారులకు టిక్కెట్లు ఇస్తారు కానీ సీఎం వైయస్ జగన్ మాత్రం సాధారణ కార్యకర్తలను అభ్యర్థులుగా ప్రకటించి కొత్త రాజకీయ చరిత్రను లిఖిస్తున్నారని ప్రజలు అంటున్నారు.

వాస్తవానికి వీరాంజనేయులు ఎం ఏ , బీఈడీ చదివారు. వాస్తవానికి అయన చంద్రబాబు కన్నా ఎక్కువ విద్యార్హతలు ఆర్జించారు. కానీ చంద్ర‌బాబు పరిపాల‌న పుణ్య‌మా అని గ‌తంలో ఆయ‌న‌కు ఉద్యోగం దక్కలేదు. అలాంటి దళిత అభ్యర్థి పట్ల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు ఇబ్బందిని కలిగించక తప్పదని అంటున్నారు. బాబుకు ఆయా వర్గాల నుంచి వ్యతిరేకత తప్పదని అంటున్నారు. ఇక‌నైనా ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం మానుకోవాల‌ని ద‌ళిత సంఘాల నాయ‌కులు హెచ్చ‌రిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version