కరోనా మహమ్మారి భారత్ లో విలయతాండవం చేస్తుంది.. మృత్యుఘంటికలు మోగిస్తుంది. రోజురోజుకి కేసులతో పాటు మరణాలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు, నాయకులు, తారలు, అధికారులు అనే తేడా లేకుండా అందరినీ పలకరిస్తుంది ఈ మహమ్మారి. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా మంది నాయకులు దీని బారిన పడ్డారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో సైతం ఇదే పరిస్థితి. తాజాగా ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. అస్వస్థతతో నిన్న ఉదయం ఆసుపత్రిలో చేరిన ఆయనకు కరోనా పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చింది. ఈరోజు మరోసారి కరోనా నిర్దారిత పరీక్షలు చేయగా పాజిటివ్ గా వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. దీంతో ఆయన సిబ్బందిని క్వారంటైన్ కు పంపుతున్నారు అధికారులు. ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారికి కూడా కరోనా టెస్టులు చేయనున్నారు.
బిగ్ బ్రేకింగ్ : ఆరోగ్యశాఖ మంత్రికి కరోనా పాజిటివ్..!
-