గుడివాడ బరిలో ఉమా..ప్రచార ప్రయోగం.!

-

రాజకీయాల్లో నిజాలు కంటే..అబద్దాలే ఎక్కువ ప్రచారం అవుతాయి. ఒక్కసారి ఏదైనా అంశం సోషల్ మీడియాలో క్రియేట్ అయ్యి అది వైరల్ అయిందంటే..ఇంకా దాని చుట్టూనే రాజకీయం జరుగుతుంది. ఇలా ఏదైనా కొత్త అంశమైన, కాంట్రవర్సీ అంశమైన క్రియేట్ చేయాలంటే వైసీపీ తర్వాతే. వారు చేసినట్లు రాజకీయం ఎవరు చేయలేరని చెప్పొచ్చు. ఏదైనా ఒకటి క్రియేట్ చేస్తే..అది రియల్ ఆర్ ఫేక్ అని తెలుసుకోవడం చాలా కష్టం. అలా ఉంటుంది వైసీపీ శ్రేణులతో.

ఇక అదే బాటలో టీడీపీ శ్రేణులు కూడా ముందుకెళుతున్నాయి. ఈ రెండు పార్టీలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేయడంలో ముందుంటున్నాయి. మరి ఎవరి క్రియేట్ చేశారో తెలియదు గాని..ఇటీవల సరికొత్త ప్రచారం ఒకటి మొదలైంది. అది ఏంటంటే టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా గుడివాడ బరిలో దిగబోతున్నారని, కొడాలి నానిపై పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఇది ఆల్రెడీ ఆన్‌లైన్ న్యూస్ సైట్లలో వైరల్ అయిపోయింది.

అసలే కొడాలిపై టీడీపీ శ్రేణులు ఎంత కసితో ఉన్నారో చెప్పాల్సిన పని లేదు. ఇక కొడాలికి చెక్ పెట్టాలంటే రావి వెంకటేశ్వరరావు బలం సరిపోవడం లేదని, అందుకే చంద్రబాబు..ఉమాతో మాట్లాడి గుడివాడలో పోటీ చేయించడానికి సిద్ధమయ్యారని కథనం వచ్చింది. గుడివాడలో కొడాలిని ఓడిస్తామని ఆ మధ్య ఉమా తొడగొట్టిన విషయం తెలిసిందే. ఇక ఇదే విషయాన్ని టీడీపీ పేజీలో పోస్టులు పెడుతున్నారు. కొడాలిని ఓడించడానికి ఒక్కడు వచ్చాడని చెప్పి కే‌జి‌ఎఫ్ స్థాయిలో ఉమాకు ఎలివేషన్స్ ఇస్తున్నారు.

కానీ ఇందులో ఏ మాత్రం నిజం ఉందనేది ఎవరికి తెలియదు. అసలు ఉమా గుడివాడలో పోటీ గురించి పార్టీలో చర్చే జరగలేదని, అయినా ఆయన మైలవరం వదిలి గుడివాడ వెళ్ళే ప్రసక్తి లేదని తెలుస్తోంది. ఒకవేళ ఉమా వచ్చినా సరే గుడివాడలో కొడాలికి చెక్ పెట్టడం సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి గుడివాడలో ఉమా పోటీ చేయడం అనేది ఉత్తిత్తి ప్రచారమే అని తెలుస్తోంది. కానీ రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. చూద్దాం మరి ఏది నిజమవుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version