ఆ విషయంలో చంద్రబాబు రాంగ్ స్టెప్ వేశారా..? టీడీపీలో జరుగుతున్న ఇంటర్నల్ డిస్కర్షన్ ఇదే..

-

ప్రభుత్వాన్ని నడపాలంటే.. అనుభవజ్ణులైన సీఎం కావాలి.. మంత్రుల కూడా ప్రతి విషయం మీద పూర్తిగా అవగాహన ఉండాలి.. ఇదే సమయంలో పార్టీ లైన్ కూడా దాటకుండా వ్యవహరించాలి.. కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్న యువ మంత్రులు తప్పటడుగులు వేస్తున్నారనే కామెంట్స్ స్వంత పార్టీలోనే వినిపిస్తున్నాయి.. ఈ విమర్శలు ఇటీవల జరిగిన పరిణామాలు కారణమట..

ఏపీ క్యాబినెట్ లో పయ్యావుల కేశవ్, పార్థసారథి, అనం రామనారాయణరెడ్డి లాంటి వాళ్లు మినహాయిస్తే అనుభవజ్ఞులైన మంత్రులెవరూ లేరు. సుదీర్ఘకాలం పాటు ఎమ్మెల్యేలుగా, మంత్రులు చేసిన వారు కావడంతో వారు మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడతారు.. పార్టీకి ఇమేజ్ తెచ్చెలా వ్యవహరిస్తారు.. కానీ కొందరు మంత్రుల వల్ల టీడీపీకి నెగిటివ్ టాక్ వస్తుందనే టాక్ బలంగా వినిపిస్తోంది..

భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకున్న సీఎం చంద్రబాబునాయుడు.. కొత్తవారికి మంత్రి పదవులు కట్టబెట్టారు.. వారికి పరిపాలన మీద అవగాహన లేకపోవడంతో తప్పులు దొర్లుతున్నాయని.. ప్రజల్లో పార్టీకి చెడ్డ పేరొస్తుందని టీడీపీ సీనియర్లు చర్చించుకుంటున్నారు. ఇటీవల జరిగిన పలు ఘటనలను వారు ఉదాహరణగా చెబుతున్నారు.. మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరిగిన క్రమంలో హోంమంత్రిత్వ శాఖ, అలాగే అచ్యుతాపురం అగ్నిప్రమాద విషయంలో కూడా కార్మిక శాఖమంత్రి మాట్లాడిన మాటలను పార్టీకి చెడ్డపేరు తెచ్చెలా ఉన్నాయని పార్టీలో ప్రచారం నడుస్తోంది.. చంద్రబాబు ఈ వ్యవహారంపై ఫోకస్ చెయ్యకపోతే పార్టీకి నష్టం వాటిల్లే అవకాశముందని నేతలు చర్చించుకుంటున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version